ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్…
ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇదో గుడ్ న్యూస్. ఈపీఎప్ క్లెయిమ్ సెటిల్మెంట్‌లో ఇబ్బందులు తలెత్తకుండా సరికొత్త విధానాన్ని ప్రారంభించింది. కరోనా విజృంభన సమయంలోనూ దూకుడుగా ముందుకు వెళ్తోంది.
ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇదో గుడ్ న్యూస్. ఈపీఎప్ క్లెయిమ్ సెటిల్మెంట్‌లో ఇబ్బందులు తలెత్తకుండా సరికొత్త విధానాన్ని ప్రారంభించింది. కరోనా విజృంభన సమయంలోనూ దూకుడుగా ముందుకు వెళ్తోంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కార్యాలయాల మూసివేత, సిబ్బంది కొరత, అధిక పని భారం వంటివి తలెత్తినప్పటికీ సభ్యుల ఆన్‌లైన్ అభ్యర్థనలను పెండింగ్‌లో పెట్టకుండా వేగంగా పరిష్కరించేలా కొత్త విధానాన్ని శ్రీకారం చుట్టింది.
ఈపీఎఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్లను ఏ ప్రాంతీయ కార్యాలయాల్లో అయినా పూర్తి చేసే సరికొత్త విధానాన్ని ప్రారంభించింది. దీని వల్ల ప్రావిడెండ్ ఫండ్, పెన్షన్, పాక్షిక విత్‌డ్రా, ట్రాన్స్ ఫర్ క్లెయిమ్‌ల వంటి వాటిని ఈ పద్ధతి ద్వారా చేసుకోవచ్చని వెల్లడించింది. బ్యాంకు ఖాతాకు మనీ ట్రాన్స్ ఫర్ మినహా మిగిలిన ప్రక్రియలను అన్నిటినీ ఇతర ప్రాంతాల్లో ఉన్న ఈపీఎఫ్‌ఓ కార్యాలయాల్లోనైనా పూర్తి చేయవచ్చని పేర్కొంది.