యువకుడిపై కోపంతో అఘాయిత్యం.. ఇద్దరికి జీవిత ఖైదు, మరొకరికి ఐదేళ్ల జైలు శిక్ష విధించిన యూఏఈ కోర్టు
దుబాయ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. యువకుడిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు జీవితఖైదు విధించింది.
Duo’s life for raped youth :దుబాయ్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. యువకుడిని కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందితులకు జీవితఖైదు విధించింది. ఈ ఘటనకు పాల్పడ్డ మరో మైనర్‌కు ఐదేళ్ల జైలుశిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం.. తమ గురించి ఇతరులకు తప్పుగా చెబుతున్నాడని, బాధితుడిపై పగ పెంచుకున్నారు. అంతేకాదు, అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని ముగ్గురు నిందితులు ప్లాన్ వేశారు. ఇందులో భాగంగా ముగ్గురిలో ఒక వ్యక్తి బాధితుడిని సరదాగా మాట్లాడుకుందాం రమ్మంటూ పిలిచాడు.
బాధితుడిని ఎడారి ప్రాంతానికి తీసుకెళ్లి ముగ్గురిలో ఇద్దరు వ్యక్తులు అతడి రెండు చేతులపై తుపాకీతో కాల్చారు. అనంతరం బాధితుడిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. మూడో వ్యక్తి ఈ ఘటనను తన కెమెరాలో రికార్డింగ్ చేశాడని పోలీసులు తమ నివేదికలో కోర్టు ముందు ఉంచారు. ఈ విషయం బయటకు చెబితే వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామంటూ నిందితులు బాధితుడిని బెదిరించారు. అయినప్పటికి బాధితుడు రస్ అల్ ఖైమా పోలీసులను ఆశ్రయించాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసలు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి కిడ్నాప్, అత్యాచారం, అవమానం కింద పలు కేసులు పెట్టి జైలుకు పంపించారు. ముగ్గురు నిందితులను రస్ అల్ ఖైమా క్రిమినల్ కోర్టులో హాజరుపరచగా.. జడ్జి ఇద్దరు నిందితులకు జీవితఖైదు విధించారు. మరో నిందితుడు మైనర్ కావడంతో అతడికి ఐదేళ్ల జైలు శిక్షను వేశారు. కింద కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులు పైకోర్టుకు వెళ్లగా.. పైకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించింది. దీంతో నిందుతులను జైలుకు తరలించారు పోలీసులు.
Read Also… Porn Racket: పోర్న్ చిత్రాల రాకెట్ కేసులో నటితో సహా 8 మంది అరెస్టు, బాలీవుడ్ లింక్ పై పోలీసుల ఆరా