పోర్న్ చిత్రాల రాకెట్ కేసులో నటితో సహా 8 మంది అరెస్టు, బాలీవుడ్ లింక్ పై పోలీసుల ఆరా
పోర్న్ చిత్రాల రాకెట్ కేసులో ఓ నటితో సహా ఎనిమిది మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. నటి గెహానా వశిస్త్ తో సహా ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ను, ఓ విదేశీ ప్రొడక్షన్..
పోర్న్ చిత్రాల రాకెట్ కేసులో ఓ నటితో సహా ఎనిమిది మందిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. నటి గెహానా వశిస్త్ తో సహా ఓ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ ను, ఓ విదేశీ ప్రొడక్షన్ కు చెందిన ఉద్యోగి కూడా అరెస్టయినవారిలో ఉన్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కాలంలో ముంబైలోను, చుట్టుపక్కల ప్రాంతాలలోని బంగళాలలో వీరు పలు ఎడల్ట్ చిత్రాలు తీశారని పోలీసులు తెలిపారు. షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నానంటూ గెహన్నా వశిస్త్ ఏకంగా ఓ ప్రొడక్షన్ హౌస్ నే ప్రారంభించి అసభ్యకర చిత్రాలను తీస్తూ వచ్చిందని వారు చెప్పారు. ఈ రాకెట్ కి సూత్రధారిగా భావిస్తున్న ఉమేష్ కామత్ అనే వ్యక్తిని సోమవారం అరెస్టు చేశారు. విదేశీ చిత్ర నిర్మాణ సంస్థతో సమన్వయం జరుపుతూ ఓటీటీ ప్లాట్ ఫామ్ లపై ఇతడు పోర్న్ చిత్రాలను అప్లోడ్ చేసేవాడని పోలీసులు చెప్పారు. ఎవరూ కనుగొనకుండా ఉండేందుకు విదేశాల్లోని సర్వర్ల ద్వారా వీరు ఈ ప్లాట్ ఫామ్ లపై పోర్న్ క్లిప్ లను అప్లోడ్ చేసేవారని, కానీ వీరి బండారం బయట పడిందని ముంబై పోలీసులు వెల్లడించారు.
లఘు చిత్రాల్లో అవకాశాలు ఇప్పిస్తామని మభ్యపెడుతూ ఈ రాకెట్ సభ్యులు.. చిత్రాల్లో ఛాన్స్ ల కోసం ఆశించేవారిని ఈ మగ్గు లోకి లాగుతున్నారని తమ దర్యాప్తులో తేలినట్టు చెప్పారు. బాలీవుడ్ లో మరికొందరికి కూడా ఈ రాకెట్ తో సంబంధం ఉందా అన్న విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read More: