Delhi Court Verdict Today: జర్నలిస్ట్ ప్రియా రమణి వర్సెస్ మాజీ కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్ కేసు, ఢిల్లీ కోర్టు తీర్పు ఏం చెబుతుందో ?
జర్నలిస్ట్ ప్రియా రమణిపై మాజీ కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు బుధవారం మధ్యాహ్నం తీర్పు చెప్పే అవకాశాలున్నాయి..
Delhi Court Verdict Today: జర్నలిస్ట్ ప్రియా రమణిపై మాజీ కేంద్ర మంత్రి ఎం.జె. అక్బర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు బుధవారం మధ్యాహ్నం తీర్పు చెప్పే అవకాశాలున్నాయి. తనను అక్బర్ లైంగికంగా వేధించారంటూ ప్రియా రమణి లోగడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మీ టూ ఉద్యమ నేపథ్యంలో ఆమె చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తించాయి. అయితే ఈమె ఆరోపణలను అక్బర్ ఖండించిన సంగతి విదితమే. వీరిద్దరి వాదనలు ముగిసిన అనంతరం ఈ నెల 1 న అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ తీర్పును రిజర్వ్ లో ఉంచుతూ ఆదేశించారు. 2018 లో మీ టూ ప్రచారోద్యమం ప్రబలంగా ఉన్న సమయంలో అక్బర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ప్రియా రమణి అదే ఏడాది అక్టోబరు 15 న ఫిర్యాదు చేశారు. ఆ సంవత్సరంలోనే ఈ పరిణామాల నేపథ్యంలో ఎం.జె. అక్బర్ అక్టోబర్ 17 న రాజీనామా చేశారు. తనపై ఈమె చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశంతో తనపై నింద వేసిందని, తన పరువుకు నష్టం కలిగించిందంటూ అక్బర్ డిఫమేషన్ దావా వేశారు.
ఉన్నత పదవుల్లో ఉన్నవారు సైతం ఇలా లైంగిక వేధింపులకు దిగడం దారుణమని ప్రియా రమణి తన పిటిషన్లో పేర్కొన్నారు.
Read More:
ఆ సీట్లో నేను కూర్చోలేదు… తనపై ఆరోపణలను ఖండించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా