Petrol, Diesel price: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత మేర పెరిగిందంటే..?
petrol, diesel price today: దేశంలో ప్రతిరోజూ పెట్రో ధరలు మారుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు..
petrol, diesel price today: దేశంలో ప్రతిరోజూ పెట్రో ధరలు మారుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరలను 30 పైసల మేర పెంచాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.87.60కి చేరగా.. డీజిల్ ధర రూ.77.73కు పెరిగింది. ఇక ముంబైలో పెట్రోల్ ధర రూ.94.12 ఉండగా.. డీజిల్ రూ.84.63కి చేరింది. బెంగళూరులో పెట్రోల్ రూ.90.53, డీజిల్ రూ.82.40గా ఉంది. చెన్నైలో పెట్రోల్ రూ.89.96కి చేరగా.. డీజిల్ రూ.82.90కి పెరిగింది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.88.92, డీజిల్ రూ.81.31గా ఉంది.
ఇదిలాఉంటే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.91.09గా ఉండగా, డీజిల్ ధర రూ.84.79కి పెరిగింది. వరంగల్ పెట్రోల్ ధర రూ. 90.67, డీజిల్ 84.38 కి పెరిగింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలో పెట్రోల్ ధర రూ. 93.17 ఉండగా.. డీజిల్ ధర 86.41కి చేరింది. గుంటూరులో పెట్రోల్ రూ.93.70 కి చేరగా.. డీజిల్ 86.90కి పెరిగింది.
Also Read: