బెంగుళూరు డ్రగ్స్ కేసులో వెలుగుచూస్తున్న సంచలన నిజాలు.. బయటపడుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధుల పేర్లు..!

కొద్దిరోజుల క్రితం ప‌ట్టుబ‌డ్డ నైజీరియ‌న్స్‌ను బెంగుళూరు పోలీసులు విచారించ‌గా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.

బెంగుళూరు డ్రగ్స్ కేసులో వెలుగుచూస్తున్న సంచలన నిజాలు.. బయటపడుతున్న తెలంగాణ ప్రజాప్రతినిధుల పేర్లు..!
Drugs
Follow us
Balaraju Goud

| Edited By: Team Veegam

Updated on: Apr 03, 2021 | 6:29 PM

Bengaluru Drug Racket:  బెంగుళూరులో డ్ర‌గ్స్ తీగలాగితే… డొంక హైద‌రాబాద్ లో క‌దులుతుంది. కొద్దిరోజుల క్రితం ప‌ట్టుబ‌డ్డ నైజీరియ‌న్స్‌ను బెంగుళూరు పోలీసులు విచారించ‌గా.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. క‌న్నడ నిర్మాత శంక‌ర్ గౌడ్ తో క‌లిసి క‌ల‌హ‌ర్ రెడ్డి, సందీప్ ఈ డ్రగ్స్ కొనసాగించినట్లు తెలుస్తోంది.

బెంగళూరు డ్రగ్స్ కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు నగరంలో పబ్ లు, హోటళ్లను హైదరాబాద్ వ్యాపారవేత్తలు సందీప్, కలహర్ రెడ్డిలకు, కన్నడ సినీ నిర్మాత శంకర్ గౌడ్ కు డ్రగ్స్ సరఫరా చేసినట్టు నైజీరియన్లు పేర్కొనడంతో పోలీసులు ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే సందీప్ ను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

కలహార్ రెడ్డి తెలంగాణకు చెందిన ప్రజాప్రతినిధులకు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులకు పార్టీలు ఇచ్చినట్లు సందీప్ వాంగ్మూలం ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీల్లో పాల్గొన్నారని, వారు సైతం డ్రగ్స్ తీసుకున్నారని సందీప్ పేర్కొన్నారు. ఓ ఎమ్మెల్యే కోరిక మేరకు పలుమార్లు కొకైన్ పంపినట్టు సందీప్ పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తెలంగాణలో చాలా మంది ప్రముఖులకు రెగ్యూల‌ర్‌గా స‌ప్లై చేస్తామ‌ని, తెలుగు సినీ ప‌రిశ్రమ ప్రముఖులంతా క‌లిసి పార్టీలు చేసుకుంటార‌ని తెలిపిన‌ట్లు ప్రచారం జ‌రుగుతుంది. కలహర్ రెడ్డి, శంకర్ గౌడ్ తో పాటు తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా బెంగళూరు పోలీసులు త్వరలోనే ప్రశ్నించనున్నారు. వీరికి త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఈ ఎమ్మెల్యేలంతా బెంగుళూరు కేంద్రంగా ప‌లు వ్యాపారాలు కొన‌సాగిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో లేరంటే… వీరంతా బెంగుళూరులో ఉన్నట్లేన‌న్న చ‌ర్చ స్థానికంగా ఉంది. ఎమ్మెల్యేలతో పాటు వీరికి స‌న్నిహితంగా ఉండే నేత‌ల పేర్లను సందీప్ రెడ్డి చెప్పిన‌ట్లు క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిని కూడా బెంగుళూరు పోలీసులు విచారించ‌నున్నారు. గ‌తంలో తెలుగు సినీ పరిశ్రమలో బయటపడ్డ డ్రగ్స్ రాకెట్.. రాజ‌కీయ ఒత్తిళ్లతో విష‌యం స‌మ‌సిపోయింద‌ని, కానీ ఇప్పుడు బెంగుళూరు పోలీసులు మాత్రం దూకుడుగా ఉన్నార‌ని తెలుస్తోంది.

Read Also…  Shocking News: శోభనం రాత్రి ఎంతో ఆసక్తిగా గదిలోకి వెళ్లిన వరుడు.. క్షణాల వ్యవధిలోనే భార్యను వదిలి పరుగెత్తుకొచ్చాడు..

శోభనం రాత్రి ఎంతో ఆసక్తిగా గదిలోకి వెళ్లిన వరుడు.. క్షణాల వ్యవధిలోనే భార్యను వదిలి పరుగెత్తుకొచ్చాడు..

Pushpa Movie : ‘పుష్ప’నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ .. అడవిలో బన్నీ మెరుపు పరుగు