హైదరాబాద్‌లో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెళ్ళు.. కరోనాపై సెకెండ్ లెవెల్ సమరం

కరోనా హబ్‌గా మారుతున్న హైదరాబాద్ నగరంలో సెకెండ్ లెవెల్ సమరం మొదలైంది. లాక్ డౌన్ ఆంక్షలను యధేచ్ఛగా నిర్లక్ష్యం చేస్తున్న ప్రజలను రెండో స్థాయి సమరంతో కట్టడి చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది.

హైదరాబాద్‌లో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెళ్ళు.. కరోనాపై సెకెండ్ లెవెల్ సమరం
Follow us

|

Updated on: Apr 17, 2020 | 12:43 PM

కరోనా హబ్‌గా మారుతున్న హైదరాబాద్ నగరంలో సెకెండ్ లెవెల్ సమరం మొదలైంది. లాక్ డౌన్ ఆంక్షలను యధేచ్ఛగా నిర్లక్ష్యం చేస్తున్న ప్రజలను రెండో స్థాయి సమరంతో కట్టడి చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. దాదాపు 27 రోజుల నుంచి లాక్ డౌన్లో వుంటున్న ప్రజలు నిత్యావసర వస్తువుల ప్రొక్యూర్మెంట్ కోసం బయటికి వస్తూనే వున్నారు. వీరిలో కొందరు నిజమైతే.. కొందరు ఫేక్ అని పోలీసులు గుర్తించారు. ఇలా వీరిని కట్టడి చేయడం ఇబ్బందికరంగా మారడంతో ఇంకోరకంగా ప్రజలను రక్షించేందుకు ప్లాన్ చేసింది ప్రభుత్వం.

హైదరాబాద్ మహా నగరంలో కరోనా మహమ్మారి విజృంబిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ప్రధాన వెజిటబుల్ మార్కెట్లలో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెళ్ళను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వేల సంఖ్యలో కూరగాయలు, పండ్లు కొనడానికి వస్తున్న ప్రజలు ఎవరికి వైరస్ ఉందో ఎవరికి లేదో తెలియని పరిస్థితి తలెత్తుతోంది. డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్ ద్వారా కాస్త అయినా కరోనా వ్యాప్తిని అడ్డుకువచ్చనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది.

ఎక్కడికక్కడ ఎమ్మెల్యే లు, కార్పొరేట్లు, ప్రజాప్రతినిధులు తమ తమ ఏరియాల్లోని మార్కెట్లలో డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్స్ ఏర్పాటు చేయడం ప్రారంభించారు. ఇక డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్స్ ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం కొన్ని సూచనలను ప్రజా ప్రతినిధులకు, అధికారులకు పాస్ చేసింది. సూపర్ మార్కెట్ల ఎంట్రెన్స్‌లలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. ఈ రకమైన డిస్ ఇన్ఫెక్షన్ టన్నెళ్ళను పెద్ద ఎత్తున తెప్పిస్తే.. రాజధానిలోని మాల్స్, రెస్టారెంట్స్ అన్నింటినీ తిరిగి వెంటనే ఓపెన్ చేయించవచ్చు కదా అంటున్నారు సామాన్య ప్రజానీకం.