వెబ్ సిరీస్‌గా ‘చ‌లం మైదానం’‌.. నిర్మాత‌గా మారిన డైరెక్ట‌ర్‌..

ఈ క్ర‌మంలోనే ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి ఇంట్రెస్టింగ్ న‌వ‌ల‌లు, సీరియ‌ల్స్‌పై క‌న్నేశాయి. అందులో భాగంగానే ఓ ప్ర‌ముఖ న‌వ‌ల‌ వెబ్ సిరీస్ రూపంలో తెర‌కెక్క‌నుంది. అదేంట‌ని అనుకుంటున్నారా. చ‌లం రాసిన 'మైదానం'. ఈ న‌వల ఆధారంగానే ఓ వెబ్ సిరీస్‌ని...

వెబ్ సిరీస్‌గా 'చ‌లం మైదానం'‌.. నిర్మాత‌గా మారిన డైరెక్ట‌ర్‌..
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2020 | 6:21 PM

ప్ర‌స్తుతం డిజిట‌ల్ మీడియాకే ప్రాధాన్య‌త ఎక్కువ పెరుగుతోంది. అందులోనూ ప్ర‌స్తుతం క‌రోనా సంక్షోభం కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా థియేట‌ర్స్ అన్నీ మూత‌ప‌డ్డాయి. దీంతో ప్రేక్షకులు ఎక్కువ‌గా ఓటీటీల‌పైనే దృష్టి పెడుతున్నారు. కాగా ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో.. మ‌రికొన్ని నెల‌లు దాకా థియేట‌ర్స్ తెరుచుకునే దాఖ‌లాలు క‌నిపించ‌డం లేదు. ఇప్పుడు దీన్నే క్యాష్ చేసుకోవాల‌ని చూస్తున్నాయి డిజిట‌ల్ మీడియాలు.

ఈ క్ర‌మంలోనే ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి ఇంట్రెస్టింగ్ న‌వ‌ల‌లు, సీరియ‌ల్స్‌పై క‌న్నేశాయి. అందులో భాగంగానే ఓ ప్ర‌ముఖ న‌వ‌ల‌ వెబ్ సిరీస్ రూపంలో తెర‌కెక్క‌నుంది. అదేంట‌ని అనుకుంటున్నారా. చ‌లం రాసిన ‘మైదానం’. ఈ న‌వల ఆధారంగానే ఓ వెబ్ సిరీస్‌ని రూపొందిచ‌బోతున్నార‌ట‌.

‘నీది నాది ఒకే క‌థ సినిమా’తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని, ప్రస్తుతం రానా ద‌గ్గుబాటితో ‘విరాట ప‌ర్వం’ తెర‌కెక్కిస్తున్న యంగ్ డైరెక్ట‌ర్ వేణు ఊడుగుల‌. ఇప్పుడు ఇత‌నే నిర్మాత‌గా మారి ‘మైదానం’ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నార‌ట‌. తెలుగు ఓటీటీ యాప్ ‘ఆహా’ కోసం ఈ వెబ్ సిరీస్ రూపొందించ‌బోతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. కాగా మ‌రో వైపు ఆహా యాప్ కూడా కొత్త కొత్త కంటెంట్‌, వెబ్ సిరీస్‌ల‌తో ముందుకు దూసుకెళ్తుంది. ఇటీవ‌లే మెగాస్టార్ పెద్ద కూతురు సుష్మిత నిర్మాత‌గా మారుతున్న సంగ‌తి తెలిసిందే క‌దా. సుష్మిత నిర్మించే వెబ్ సిరీస్‌లు కూడా త‌న మేన‌మామ అల్లు అర‌వింద్‌కు సంబంధించిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

Read More:

శుభ‌వార్త‌.. క‌రోనా మందు మ‌రింత త‌క్కువ ధ‌ర‌కే..

సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి రిజ‌ల్ట్స్ రిలీజ్..

ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు క‌రోనా..