డేటా చోరి కేసు: నేడు సిట్ ముందుకు అశోక్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరి కేసులో ప్రధాన నిందితుడైన అశోక్ ఇవాళ తెలంగాణ సిట్ ఎదుట హాజరుకావాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా అఙ్ఞాతంలో ఉన్న అతను విచారణకు హాజరవుతాడా? లేదా? అన్నది ఉత్కంఠంగా మారింది. ఒకవేళ అతను విచారణకు రాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే డేటా చోరి కేసులో ఈ నెల 2, 3 తేదీల్లో అశోక్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. […]

డేటా చోరి కేసు: నేడు సిట్ ముందుకు అశోక్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 13, 2019 | 7:47 AM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరి కేసులో ప్రధాన నిందితుడైన అశోక్ ఇవాళ తెలంగాణ సిట్ ఎదుట హాజరుకావాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా అఙ్ఞాతంలో ఉన్న అతను విచారణకు హాజరవుతాడా? లేదా? అన్నది ఉత్కంఠంగా మారింది. ఒకవేళ అతను విచారణకు రాకపోతే అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే డేటా చోరి కేసులో ఈ నెల 2, 3 తేదీల్లో అశోక్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే అఙ్ఞాతంలో ఉన్న అశోక్ ఆ నోటీసులకు స్పందించలేదు. దాంతో తాజాగా సోమవారం మోసారి నోటీసులు పంపారు. వీటికి స్పందించి ఇవాళ అశోక్ అధికారుల ముందు హాజరైతే.. రెండు రాష్ట్రాలకు చెందిన పౌరుల డేలా ఎలా వచ్చింది, దాంతో ఏం చేశారన్న ప్రశ్నలను అశోక్‌కు సంధించనున్నారు.