పేటియం బ్లాక్ అయిందని కాల్… క్షణాల్లో లక్షలు మాయం

బ్యాంకు అధికారిని కాల్ చేస్తున్నా... మీ పేటీఎం బ్లాక్ అయ్యింది... ఓటీపీ చెబితే క్షణాల్లో అన్ బ్లాక్ చేస్తామంటూ కాల్.. పాపం నిజమే అనుకున్న పెద్దాయన అకౌంట్ ఖాళీ అయ్యింది.

  • Rajesh Sharma
  • Publish Date - 5:57 pm, Mon, 13 April 20
పేటియం బ్లాక్ అయిందని కాల్... క్షణాల్లో లక్షలు మాయం

బ్యాంకు అధికారిని కాల్ చేస్తున్నా… మీ పేటీఎం బ్లాక్ అయ్యింది… ఓటీపీ చెబితే క్షణాల్లో అన్ బ్లాక్ చేస్తామంటూ కాల్.. పాపం నిజమే అనుకున్న పెద్దాయన అకౌంట్ ఖాళీ అయ్యింది. ఇదెక్కడే మారుమూల ప్రాంతంలో జరిగిన మోసం కాదు. సాక్షాత్తు హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో వెలుగు చూసిన దారుణ మోసం.

బేగంపేట సమీపంలోని కుందన్‌బాగ్‌లో నివాసముండే ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారికి సైబర్ నేరగాళ్ళ టీమ్ కాల్ చేశారు. పెద్దాయన పేటీఎం అకౌంట్ బ్లాక్ అయ్యిందని బాంబు పేల్చారు. ఏం ఫరవాలేదు.. మేం బ్యాంకు నుంచే మాట్లాడుతున్నాం… ఓటీపీ పంపుతాం కన్ ఫర్మ్ చేస్తే.. వెంటనే పేటీఎం అకౌంట్ అన్ బ్లాక్ చేసేస్తామన్నారు. అతని మాటలు నమ్మి తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్ చెప్పేశారు ఆ పెద్దాయన. పెద్దాయన పేరు శ్రీనివాస్ రెడ్డి. ఓటీపీ చెప్పిన కొన్ని గంటల వ్యవధిలో శ్రీనివాస్ రెడ్డి అకౌంట్ నుంచి లక్షా 85 వేల రూపాయలు మాయం అయ్యాయి.

అమౌంట్ కట్ అయిన సంగతి మెసేజ్ రాగానే తాను మోసపోయినట్లు గుర్తించారు శ్రీనివాస్ రెడ్డి. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇదే తరహాలో సంజీవరెడ్డి నగర్‌కు చెందిన హరీష్ రాజ్ వ్యక్తి అకౌంట్ నుండి లక్షా 32 వేల రూపాయలు… సికింద్రాబాద్‌కు చెందిన కాశీనాథ్ అనే వ్యక్తి అకౌంట్ నుండి లక్షా 30 వేల రూపాయలను విత్ డ్రా చేసిన సైబర్ నేరగాళ్లు. ఒక్కో కేసు తమ వద్దకు చేరడంతో సైబర్ పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించారు.