Breaking: గాలి ద్వారా వ్యాప్తిస్తున్న వైరస్..! : డబ్ల్యూహెచ్ఓ
డబ్ల్యూహెచ్ఓ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. కోవిడ్ 19 గాలిలో ఉన్నట్లు నిర్ధారించారు. ఇది 8 గంటల పాటు గాలిలో ఉంటుందని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు.
డబ్ల్యూహెచ్ఓ అధికారులు మరోసారి షాక్ ఇచ్చారు. కోవిడ్ 19 గాలిలో ఉన్నట్లు నిర్ధారించారు. ఇది 8 గంటల పాటు గాలిలో ఉంటుందని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. మనుషుల మధ్య దూరంతో పాటు మొఖానికి అడ్డుగా మాస్క్ ఉండాల్సిందేనంటున్నారు. ముఖ్యంగా ఆస్పత్రుల్లో పనిచేసే వైద్య సిబ్బంది పూర్తిగా రక్షణ కల్పించే దుస్తులను మాత్రమే వాడాలని సూచిస్తున్నారు
గతంలో తుమ్మిన, దగ్గిన, ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్లు ఇతరుల మీద పడితే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇందుకు మోచేతిని అడ్డం పెట్టుకొని తుమ్మాలని, అదేవిధంగా చేతుల్ని తరచుగా శుభ్రం చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిపుణులు సూచించారు. అయితే, వైరస్ రోజుకోకకొత్త రూపాంతంర చెందునట్లు నిపుణులు చేస్తున్న వాదన బలం చేకూరుస్తుంది. గాలిద్వారా కూడా సంక్రమిస్తుందని, దీనికి ఆధారాలున్నాయని పేర్కొంటూ డబ్ల్యూహెచ్ఓకి వందలాది మంది శాస్త్రవేత్తల బృందం బహిరంగ లేఖ రాశారు. గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున సూచనలు, సిఫార్సులను సవరించాలని కోరుతూ డబ్ల్యూహెచ్ఓకి శాస్త్రవేత్తలు లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా మరిన్ని పరిశోధనలు జరిగాల్సిన అవసరం ఉందంటున్నారు.