తెలంగాణలో మరో 66 కరోనా కేసులు.. ఏపీలో..
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో ఇప్పటి వరుకు ఏడువందలకు పైచిలుకు నమోదవ్వగా.. ఏపీలో ఐదువందలు దాటి ఆరువందలకు చేరువలో ఉంది. శుక్రవారం తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ ప్రకారం.. తాజాగా మరో 66 కేసులు నమోదైనట్లు పేర్కొంది. గత రెండు రోజుల్లోనే రాష్ట్రంలో 116 కేసులు నమోదయ్యియొ. వీటిలో ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నట్లు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లాలో 15 కేసులు నమోదవ్వగా.. ఆదిలాబాద్‌లో […]

తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో ఇప్పటి వరుకు ఏడువందలకు పైచిలుకు నమోదవ్వగా.. ఏపీలో ఐదువందలు దాటి ఆరువందలకు చేరువలో ఉంది. శుక్రవారం తెలంగాణ ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ ప్రకారం.. తాజాగా మరో 66 కేసులు నమోదైనట్లు పేర్కొంది. గత రెండు రోజుల్లోనే రాష్ట్రంలో 116 కేసులు నమోదయ్యియొ. వీటిలో ఎక్కువగా జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవుతున్నట్లు తెలుస్తోంది.
సూర్యాపేట జిల్లాలో 15 కేసులు నమోదవ్వగా.. ఆదిలాబాద్‌లో 3, జోగులాంబ గద్వాల, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. అయితే మంచిర్యాల జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదయ్యింది. మొత్తం శుక్రవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 766కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి బయటపడి..186 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ఇక ఇప్పటివరకు కరోనా బారినపడి 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 562 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి.

ఇక ఏపీలో శుక్రవారం కొత్తగా 38 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 572కి చేరింది.



