Lockdown: తమిళనాడులో నేటినుంచి లాక్ డౌన్.. పూర్తిగా మూత పడనున్న షాపింగ్ మాల్స్, థియేటర్లు.. సరిహద్దులో భారీగా నిలిచిన వాహనాలు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అడ్డు అదపు లేకుండా కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Lockdown: తమిళనాడులో నేటినుంచి లాక్ డౌన్.. పూర్తిగా మూత పడనున్న షాపింగ్ మాల్స్, థియేటర్లు.. సరిహద్దులో భారీగా నిలిచిన వాహనాలు
Lockdown
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 26, 2021 | 7:49 AM

Tamil Nadu Lockddown: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి అడ్డు అదపు లేకుండా కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్న సమయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి లాక్ డౌన్ విధిస్తే తప్ప కరోనాను నియంత్రించలేమని పళనిస్వామి సర్కార్ భావించింది. వైరస్ ఉద్ధృతి అధికంగా ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి పూర్తిగా లాక్‌డౌన్‌ విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సోమవారం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు లాక్‌‌డౌన్ అమలులో ఉంటాయని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ సందర్భంగా 33శాతం ఉద్యోగులతోనే ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తామని తెలిపింది. పరిశ్రమల్లో సిబ్బంది 50 శాతానికి కుదింపు.. ప్రజారవాణాను పూర్తిగా నిలిపివేయాలని అధికారులను ఆదేశించింది. షాపింగ్ మాల్స్, థియేటర్లు పూర్తిగా మూత పడనున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అయితే, ఎటువంటి సడలింపు లేకుండా పూర్తి స్థాయి షట్ డౌన్ ఉంటుందని సీఎం తెలిపారు.

ముఖ్యంగా పొరు రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో చెక్ పోస్టుల వద్ద మెడికల్ క్యాంప్ ల ఏర్పాటు చేస్తున్నట్లు తమిళ సర్కార్ పేర్కొంది. ఈ పాస్ ఉన్నవారిని మాత్రమే తమిళనడులోకి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రాత్రి 7 నుంచి ఉదయం 5 వరకు రవాణా వ్యవస్థ పై పూర్తి ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొంది. కాగా తమిళనాడులో లాక్‌డౌన్ కారణంగా నెల్లూరు జిల్లా తడ వద్ద ఆంద్రా, తమిళనాడు సరిహద్దులో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

Read Also…  ఇండియాకు అత్యవసర సాయం చేస్తాం, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్

దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త