లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఉదారత చాటుకున్న టాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్‌..!

లాక్‌డౌన్ ఎఫెక్ట్: ఉదారత చాటుకున్న టాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్‌..!

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా లాక్ డౌన్ విధించ‌డంతో అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో.. చాలామందికి ఉపాధి కష్టమైంది. మిగ‌తా విభాగానికి చెందిన వారితో పాటుగా, సినిమా రంగానికి చెందిన సినీ పాత్రికేయులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 13, 2020 | 8:40 PM

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా లాక్ డౌన్ విధించ‌డంతో అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో.. చాలామందికి ఉపాధి కష్టమైంది. మిగ‌తా విభాగానికి చెందిన వారితో పాటుగా, సినిమా రంగానికి చెందిన సినీ పాత్రికేయులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారి కోసం టాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ తమ ఉదారతను చాటుకున్నారు. వారికి ఆస‌రాగా నిల‌వాలన్న ఉద్దేశ్యంతో 87 మందికి సోమ‌వారం నాడు ఒక్కొక్క మెంబ‌ర్ కి ఐదువేల రూపాయ‌లు చొప్పున అకౌంట్ లో వేశారు. అలాగే గ‌త వారం కొంత మందికి నిత్యావ‌స‌ర వ‌స్తువులను కూడా అందించారు.

ఈసంద‌ర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ” క‌మిటీ స‌భ్యులంద‌రి స‌హాయ స‌హకారాల‌తో  87 మందికి ఒక్కొక్క‌రికి ఐదు వేల రూపాయ‌లు చొప్పున అకౌంట్ లో డబ్బులు వేశాము.సినిమా ఇండ‌స్ట్రీలోని 24 క్రాప్ట్స్ కి.. ఎప్పుడూ ముందుండి వారి గురించి ప్ర‌జ‌ల‌కు చేర‌వేసేది మా సినీ పాత్రికేయ కుటుంబ‌మే. సినీ కార్మికుల సంక్షేమం కోసం చేసే మంచి ప‌నుల విష‌యంలో సినీ పాత్రికేయుల‌ను కూడా దృష్టిలో పెట్టుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా కోరుకుంటున్నాను” అని అన్నారు.

జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జ‌నార్ధ‌న్ రెడ్డి మాట్లాడుతూ.. ”స‌మిష్టిగా అంద‌రూ క‌లిసి ప‌నిచేస్తున్నాం. క‌మిటీ స‌భ్యులంద‌రి స‌హ‌కారంతో ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి విప‌త్తు ఎప్పుడూ రాకూడ‌ద‌ని కోరుకుంటున్నాను” అని అన్నారు. అలాగే ట్రెజరర్ భూషణ్ మాట్లాడుతూ.. ”అసోసియేషన్ తరఫున ముందుగా చెప్పినట్లుగా ఆదివారం సాయంత్రం వరకు వచ్చిన లిస్ట్ ప్రకారంగా ఈరోజు 87 మందికి 5,000 చొప్పున పంపిణీ చేశాము. మిగిలిన జర్నలిస్టులు కూడా ఎవరైనా అవసరం ఉన్నవారు అసోసియేషన్ కమిటీ సభ్యులను సంప్రదించగలరు” అని తెలిపారు.

Read This Story Also: షాకింగ్.. డిశ్చార్జి అయిన కొన్ని గంటల్లోనే కరోనా పాజిటివ్..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu