లాక్‌డౌన్‌లో ఈ ఏడు సూత్రాలు త‌ప్ప‌ని స‌రిః ప్ర‌ధాని మోదీ

దేశ వ్యాప్తంగా వచ్చే నెల 3వరకూ లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 14న‌(మంగ‌ళ‌వారం) జాతి నుద్దేశించి ప్రసంగించిన మోదీ దేశంలో కరోనా నియంత్రణకు పలువురు ముఖ్యమంత్రులు చేసిన డిమాండ్ ను పరిగణనలోనికి తీసుకుని లాక్‌డౌన్‌ ను మే 3వరకూ పొడిగించినట్లు చెప్పారు. దీంతో మరో 19 రోజుల పాటు దేశంలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది. జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ ఇంత వరకూ లాక్‌డౌన్‌ కు దేశ ప్రజల సహకారానికి శిరసు […]

లాక్‌డౌన్‌లో ఈ ఏడు సూత్రాలు త‌ప్ప‌ని స‌రిః ప్ర‌ధాని మోదీ
Follow us

|

Updated on: Apr 14, 2020 | 3:00 PM

దేశ వ్యాప్తంగా వచ్చే నెల 3వరకూ లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 14న‌(మంగ‌ళ‌వారం) జాతి నుద్దేశించి ప్రసంగించిన మోదీ దేశంలో కరోనా నియంత్రణకు పలువురు ముఖ్యమంత్రులు చేసిన డిమాండ్ ను పరిగణనలోనికి తీసుకుని లాక్‌డౌన్‌ ను మే 3వరకూ పొడిగించినట్లు చెప్పారు. దీంతో మరో 19 రోజుల పాటు దేశంలో లాక్ డౌన్ అమలులో ఉంటుంది. జాతి నుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ ఇంత వరకూ లాక్‌డౌన్‌ కు దేశ ప్రజల సహకారానికి శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు చెప్పారు.

దేశంలో కరోనా వ్యాప్తి వేగంగా ఉందన్న ఆయన లాక్‌డౌన్‌ కష్టాలను తట్టుకుని సమిష్టిగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాపై పోరుకు ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారని చెప్పారు. కరోనా నియంత్రణకు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని చెప్పారు. 21 రోజుల లాక్‌డౌన్‌ దేశంలో సమర్ధంగా అమలు చేయడం వల్లనే ఇతర దేశాల కంటే భారత్ లో కరోనా వ్యాప్తి 20 నుంచి 30 శాతం వరకూ తక్కువగా ఉందని ప్ర‌ధాని స్ప‌ష్టం చేశారు. ఇక లాక్‌డౌన్ కాలంలో ప్ర‌జ‌లంద‌రై త‌ప్ప‌క పాటించాల్సిన ఏడు నియ‌మాల‌ను ప్ర‌ధాని వెల్ల‌డించారు.

మోదీ సప్తపది ఇది: 1. ఇంట్లోని వృద్దులపట్ల ప్రత్యేక శ్రద్ద చూపండి.. గతంలో ఏమైనా రోగాలున్న వారిపై ప్రత్యేక శ్రద్ద చూపించండి. 2. లాక్ డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ లక్ష్మణ రేఖను పాటించండి… ఇంట్లో రూపొందించిన ఫేస్ మాస్క్ వాడుకోండి 3. రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి నియమాలను పాటించండి 4. కరోనా నియంత్రణ కోసం రూపొందించిన ఆరోగ్య సేతు మొబైల్ యాప్ త‌ప్ప‌క‌ డౌన్ లోడ్ చేసుకోండి… ఇతరుల‌కు వాడ‌మ‌ని చెప్పండి. 5. పేదలకు సేవ చేసేందుకు వీలైనంత ప్రయత్నించండి 6. సహా ఉద్యోగులపట్ల శ్రద్ద చూపండి.. ఎవరి ఉద్యోగాలు తీసేయవద్దు 7. మెడికల్ స్టాఫ్, పోలీస్, శానిటైజ‌ర్ సిబ్బందిని గౌరవించండి