కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,154 కొత్త కేసులు.. 8 మరణాలు

గత కొన్ని రోజులుగా తెలంగాణలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఇవాళ మళ్లీ 2వేలను దాటేశాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో 2,154 కొత్త కేసులు.. 8 మరణాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 07, 2020 | 9:37 AM

Telangana Corona Bulletin: గత కొన్ని రోజులుగా తెలంగాణలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు.. ఇవాళ మళ్లీ 2వేలను దాటేశాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,154 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,04,748 కు చేరింది. 24 గంటల్లో 8 మంది కరోనా బారిన పడి మరణించగా.. మృతుల సంఖ్య 1,189 చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 2,239 మంది డిశ్చార్జ్‌ కాగా.. కోలుకున్న వారి సంఖ్య 1,77,008 కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 26,551 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 54,227 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్ట్‌ల సంఖ్య 33,46,472 కు చేరింది.

జిల్లాల వారీగా వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 303, ఆదిలాబాద్ 23, భద్రాద్రి కొత్తగూడెం 92, జగిత్యాల్‌ 45, జనగాం 23, జయశంకర్ భూపాలపల్లి 25, జోగులమ్మ గద్వాల్‌ 19, కామారెడ్డి 71, కరీంనగర్‌ 96, ఖమ్మం 121, కొమరం భీమ్‌ అసిఫాబాద్‌ 16, మహబూబ్‌ నగర్‌ 40, మహబూబాబాద్‌ 45, మంచిర్యాల్‌ 39, మెదక్‌ 29, మేడ్చల్ మల్కాజ్‌గిరి 187, ములుగు 25, నాగర్‌ కర్నూల్‌ 33, నల్గొండ 124, నారాయణ్‌పేట్‌ 12, నిర్మల్‌ 19, నిజామాబాద్‌ 60, పెద్దంపల్లి 42, రాజన్న సిరిసిల్ల 41, రంగారెడ్డి 205, సంగారెడ్డి 63, సిద్ధిపేట్‌ 78, సూర్యాపేట 79, వికారాబాద్‌ 28, వనపర్తి  31, వరంగల్‌ రూరల్‌ 28, వరంగల్‌ అర్బన్‌ 74, యాద్రాది భువనగిరి 38 కేసులు నమోదయ్యాయి.

Read more:

నేను అలా చెప్పేలేదు.. పవన్ ‘గబ్బర్‌సింగ్’‌ నా లైఫ్‌ని మార్చిన మూవీ..!

కరోనా జాగ్రత్తలు పాటించడంలో ముందంజలో మహిళలు