నేను అలా చెప్పేలేదు.. పవన్ ‘గబ్బర్‌సింగ్’‌ నా లైఫ్‌ని మార్చిన మూవీ..!

లోకనాయకుడు కమల్‌ హాసన్‌ తనయ శ్రుతీహాసన్‌ వివాదాలకు కాస్త దూరంగానే ఉంటారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో

నేను అలా చెప్పేలేదు.. పవన్ 'గబ్బర్‌సింగ్'‌ నా లైఫ్‌ని మార్చిన మూవీ..!
Follow us

| Edited By:

Updated on: Oct 07, 2020 | 9:15 AM

Shruthi Haasan clarification: లోకనాయకుడు కమల్‌ హాసన్‌ తనయ శ్రుతీహాసన్‌ వివాదాలకు కాస్త దూరంగానే ఉంటారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలు ఇచ్చే సమయంలో ఆమె కాస్త ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శ్రుతీ చేసిన వ్యాఖ్యలు తెలుగు ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. ”నా కెరీర్‌లో నేను పలు బ్లాక్‌బస్టర్‌ చిత్రాల్లో నటించాను. అయితే వాటి గురించి నేను గొప్పగా ఏం ఫీల్‌ అవ్వను. ఇప్పటి నుంచి మంచి చిత్రాల్లో నటిస్తాను” అంటూ శ్రుతీ చెప్పినట్లుగా కొన్ని వెబ్‌సైట్‌లలో వార్తలు వచ్చాయి. అంతేకాదు గబ్బర్‌సింగ్‌, రేసు గుర్రం చిత్రాలకు శ్రుతీ విలువ ఇవ్వనట్లు అందులో పేర్కొన్నారు. దీంతో శ్రుతీపై పలువురు నెగిటివ్‌ కామెంట్లు చేయగా.. వాటిపై ఆమె సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చారు.

నేను జాతీయ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలను కొన్ని తెలుగు పబ్లికేషన్‌ తప్పుగా ప్రచురించాయి. అవన్నీ అవాస్తవాలే. రేసు గుర్రం, గబ్బర్‌ సింగ్‌లో నటించినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతుంటా. ముఖ్యంగా పవన్‌ కల్యాణ్‌ గారితో నటించిన గబ్బర్‌ సింగ్‌ నా జీవితాన్ని మార్చేసిన సినిమా. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో భాగస్వామ్యం అవ్వడం నా హృదయంలోని ఓ భాగం లాంటిది. ఆ ఇంటర్వ్యూలో నేను చేసిన హిందీ సినిమాలు, ఉత్తరం వెర్సెస్‌ దక్షిణం చిత్రాలపై ఇచ్చింది. ఇప్పటికైనా నా మాటలను అర్థం చేసుకుంటారని భావిస్తున్నా అని ట్వీట్ చేశారు. దీంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందేమో చూడాలి.

Read More:

కరోనా జాగ్రత్తలు పాటించడంలో ముందంజలో మహిళలు

Bigg Boss 4: బీబీ హోటల్‌.. అవినాష్‌ తనకు ముద్దు పెట్టాలని చూశాడన్న అరియానా