నాగ్, జగన్ ల భేటీపై సీఎం చంద్రబాబు స్పందన

నేరస్థులతో సినీనటుల భేటీ దురదృష్టకరమని సీఎం చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. దీని వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. జైలుశిక్ష అనుభవించిన జగన్ లాంటి వ్యక్తులతో నాగార్జున భేటీ కావడం సరైన పద్దతి కాదని టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యనిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాగా.. మంగళవారం ప్రముఖ నటుడు నాగార్జున వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే టాపిక్ ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. నాగార్జున వైసీపీలో […]

నాగ్, జగన్ ల భేటీపై సీఎం చంద్రబాబు స్పందన
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:52 PM

నేరస్థులతో సినీనటుల భేటీ దురదృష్టకరమని సీఎం చంద్రబాబు పరోక్షంగా స్పందించారు. దీని వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని అభిప్రాయపడ్డారు చంద్రబాబు. జైలుశిక్ష అనుభవించిన జగన్ లాంటి వ్యక్తులతో నాగార్జున భేటీ కావడం సరైన పద్దతి కాదని టీడీపీ నేతలు కూడా వ్యాఖ్యనిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాగా.. మంగళవారం ప్రముఖ నటుడు నాగార్జున వైసీపీ అధినేత జగన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇదే టాపిక్ ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. నాగార్జున వైసీపీలో చేరనున్నారని కొందరు, నాగార్జునకు గుంటూరు ఎంపీ టికెట్ ఖాయమైందని మరికొందరు, నాగార్జున తనకు కావాల్సిన వ్యక్తి కోసం జగన్‌ను కలిశారని ఇంకొందరు.. ఇలా మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై హీరో నాగార్జున నిన్నే క్లారిటీ ఇచ్చేశారు. జగన్ బంధువు అయిన కారణంగానే పాదయాత్ర ముగిసిన సందర్భంగా విష్ చేయడానికి వచ్చానే తప్ప రాజకీయాలు ఏమీ లేవని చెప్పేశారు. ఏదేమైనా రాజకీయ వర్గాల్లో నాగార్జున, జగన్ భేటీ అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.