వావ్.. భలే భలే.. “హెలికాప్టర్‌” గా మారిన “నానోకార్”

అందరూ అది చేస్తాం ఇది చేస్తాం అని కలలు కంటూ ఉంటారు. కాని కొందరు మాత్రమే ఆ కలల్ని నిజం చేసి చూపిస్తారు. బీహార్‌కి చెందిన మిథిలేష్ ప్రసాద్ చిన్నప్పటి నుంచి పైలట్ కావాలని కలలుకన్నాడు. హెలికాప్టర్‌ నడపాలనుకున్నాడు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో తన కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఆశను చంపుకోలేక ఓ వినూత్న ప్రయత్నం చేశారు. తన టాటా నానోకార్‌ని హెలికాప్టర్‌లా మార్చేశాడు. అయితే ఈ కారు హెలికాప్టర్‌లా ఎగరలేదు. కానీ… అందులో వెళ్తుంటే హెలికాప్టర్‌లో వెళ్తున్న […]

వావ్.. భలే భలే.. హెలికాప్టర్‌ గా మారిన నానోకార్
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2019 | 11:19 AM

అందరూ అది చేస్తాం ఇది చేస్తాం అని కలలు కంటూ ఉంటారు. కాని కొందరు మాత్రమే ఆ కలల్ని నిజం చేసి చూపిస్తారు. బీహార్‌కి చెందిన మిథిలేష్ ప్రసాద్ చిన్నప్పటి నుంచి పైలట్ కావాలని కలలుకన్నాడు. హెలికాప్టర్‌ నడపాలనుకున్నాడు. ఆర్థిక స్తోమత లేకపోవడంతో తన కలను నెరవేర్చుకోలేకపోయాడు. ఆశను చంపుకోలేక ఓ వినూత్న ప్రయత్నం చేశారు. తన టాటా నానోకార్‌ని హెలికాప్టర్‌లా మార్చేశాడు. అయితే ఈ కారు హెలికాప్టర్‌లా ఎగరలేదు. కానీ… అందులో వెళ్తుంటే హెలికాప్టర్‌లో వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుందని అతడు చెబుతున్నాడు. ప్రస్తుతం ఈ వెహికిల్… సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలిసిన రష్యా మీడియా ఏజెన్సీ రప్ట్లీ మిథిలేష్‌ని కలిసింది. కారుకు రోటర్ బ్లేడ్, తోక, టైల్ బూమ్, రోటర్ తగిలించి… హెలికాప్టర్ లుక్ వచ్చేలా చేసినట్లు మిథిలేష్ వివరించాడు. దీన్ని చూసిన నెటిజెన్లు చాలా రాకాలుగా కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది బాగుందని మెచ్చుకుంటుంటే.. మరి కొంతమంది ఇది చట్టవిరుద్దమనీ, నానో కార్ పేటెంట్‌ను కాపీ చేసినట్లవుతుందని అంటున్నారు.