అమెరికాతో మాత్రమే చర్చలు.. ఉత్తర కొరియా

ఉత్తర కొరియా ఎవ్వరి మాట వినేలా లేదు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటున్నాడు ఆదేశాధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్. ఈ మధ్యనే ఆయుధ పరీక్షలు చేసిన ఉత్తర కొరియా.. మరోసారి పరీక్షలను నిర్వహించింది. శనివారం అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ కొత్త ఆయుధ పరీక్షలను స్వయంగా పర్యవేక్షించారని ఆ దేశ మీడియా వెల్లడించింది. దక్షిణ కొరియాతో చర్చల ప్రస్తక్తే లేదని, ఇకపై అమెరికాతో మాత్రమే చర్చలుంటాయని స్పష్టం చేసింది ఉత్తర కొరియా. […]

అమెరికాతో మాత్రమే చర్చలు.. ఉత్తర కొరియా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 12, 2019 | 2:04 PM

ఉత్తర కొరియా ఎవ్వరి మాట వినేలా లేదు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటున్నాడు ఆదేశాధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్. ఈ మధ్యనే ఆయుధ పరీక్షలు చేసిన ఉత్తర కొరియా.. మరోసారి పరీక్షలను నిర్వహించింది. శనివారం అధ్యక్షుడు కిమ్‌ జొంగ్‌ ఉన్‌ కొత్త ఆయుధ పరీక్షలను స్వయంగా పర్యవేక్షించారని ఆ దేశ మీడియా వెల్లడించింది. దక్షిణ కొరియాతో చర్చల ప్రస్తక్తే లేదని, ఇకపై అమెరికాతో మాత్రమే చర్చలుంటాయని స్పష్టం చేసింది ఉత్తర కొరియా. అమెరికాతో త్వరలో చర్చలు జరగనున్నాయన్న వార్తల నేపథ్యంలో ఉత్తరకొరియా ఆదివారం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఇదిలా ఉంటే శనివారం.. తాము దక్షిణ కొరియాతో సైనిక విన్యాసాలు ముగించిన తర్వాత అణు నిరాయుధీకరణపై చర్చించేందుకు కిమ్ ప్రకటన చేశారంటూ ట్రంప్ చెప్పారు. ట్రంప్ ప్రకటన తర్వాత కొన్ని గంటల్లోనే ఉత్తర కొరియా ఈ వ్యాఖ్యలు చేసింది.