చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పేరు మారుస్తాం: మోడీ
చెన్నై: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు ఆ పేరు మారుస్తామని ప్రధాని మోడీ చెప్పారు. తమిళనాడు మాజీ సీఎం ఎంజి రామచంద్రన్ పేరు పెడతామని అన్నారు. తమిళనాడులోని కాంచీపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన మోడీ ఈ ప్రకటన చేశారు. దీంతో పాటు తమిళనాడులో ఉన్న విమానాశ్రయాల్లో విమానాల రాకపోకల ప్రకటనలను తమిళంలో కూడా చేయించాలని భావిస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు అభివృద్ధిపై కేంద్రం దృష్టి పెట్టిందని అన్నారు. ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసి అప్పట్లో […]

చెన్నై: చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు ఆ పేరు మారుస్తామని ప్రధాని మోడీ చెప్పారు. తమిళనాడు మాజీ సీఎం ఎంజి రామచంద్రన్ పేరు పెడతామని అన్నారు. తమిళనాడులోని కాంచీపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన మోడీ ఈ ప్రకటన చేశారు. దీంతో పాటు తమిళనాడులో ఉన్న విమానాశ్రయాల్లో విమానాల రాకపోకల ప్రకటనలను తమిళంలో కూడా చేయించాలని భావిస్తున్నట్టు తెలిపారు.
తమిళనాడు అభివృద్ధిపై కేంద్రం దృష్టి పెట్టిందని అన్నారు. ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసి అప్పట్లో ఎంజీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రద్దు చేసిందని విమర్శించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన హయాంలో మొత్తం 50 ప్రభుత్వాలను రద్దు చేసిందని గుర్తు చేశారు. అలాంటి పార్టీతో కలిసి డీఎంకె పార్టీ రాజకీయాలు చేస్తుందని విమర్శించారు.