AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లికాని యువతులే టార్గెట్‌గా అక్రమ దందా..

పెళ్లికాని పేద యువతులే ఆ ఆస్పత్రి టార్గెట్. క్లినికల్ టెస్ట్‌లకు అంగీకరిస్తే కాసులిస్తామంటూ నమ్మించి యువతులను మోసం చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా వారి దగ్గర నుంచి అండాలను సేకరిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12లో ఉన్న ఇందిరా క్లీనికల్ ఐవీఎఫ్ సెంటర్ అక్రమాలకు అడ్డాగా మారింది. ఇక్కడ చట్ట విరుద్ధంగా క్లీనికల్ టెస్ట్‌లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కామారెడ్డికి చెందిన విజయలక్ష్మీ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో పనిచేస్తోంది. అక్కడే ఆమెకు శివ అనే వ్యక్తి  పరిచయమయ్యాడు. […]

పెళ్లికాని యువతులే టార్గెట్‌గా అక్రమ దందా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 12:33 PM

Share

పెళ్లికాని పేద యువతులే ఆ ఆస్పత్రి టార్గెట్. క్లినికల్ టెస్ట్‌లకు అంగీకరిస్తే కాసులిస్తామంటూ నమ్మించి యువతులను మోసం చేస్తున్నారు. చట్ట విరుద్ధంగా వారి దగ్గర నుంచి అండాలను సేకరిస్తున్నారు.

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రోడ్ నెంబర్ 12లో ఉన్న ఇందిరా క్లీనికల్ ఐవీఎఫ్ సెంటర్ అక్రమాలకు అడ్డాగా మారింది. ఇక్కడ చట్ట విరుద్ధంగా క్లీనికల్ టెస్ట్‌లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కామారెడ్డికి చెందిన విజయలక్ష్మీ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో పనిచేస్తోంది. అక్కడే ఆమెకు శివ అనే వ్యక్తి  పరిచయమయ్యాడు. విజయలక్ష్మీ పేదరికాన్ని ఆసరాగా చేసుకున్న శివ ఆమెకు మాయ మాటలు చెప్పి ఇందిరా గాధీ క్లీనికల్ సెంటర్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ వైద్యులు పిల్లలు లేని దంపతులకు అండాన్నిస్తే డబ్బులు ఇస్తామని చెప్పారని విజయలక్ష్మీ బంధువులు చెబుతున్నారు.

విజయలక్ష్మీ అండాన్ని సేకరించిన డాక్టరు 20 వేల రూపాయాలను ఆమె చేతిలో పెట్టారు. అయితే.. అండాన్ని ఇచ్చిన తర్వాత విజయలక్ష్మీ అనారోగ్యానికి గురైంది. పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను అమీర్‌పేటలోని మరో ఆస్పత్రికి తరలించారు. అక్రమలకు పాల్పడుతున్న ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయలక్ష్మీ బంధువులు ఆందోళనకు దిగారు. కాగా.. నిబంధనలకు విరుద్ధంగా యువతులపై క్లీనికల్ టెస్ట్‌లు నిర్వహించిన కేసులో దళారి శివను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకూ ఎంతమంది నుంచి అండాలను సేకరించారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అంతరిక్షంలోకి ఇస్రో 'అన్వేషణ'.. 2026లో తొలి ప్రయోగానికి మొదలైన
అంతరిక్షంలోకి ఇస్రో 'అన్వేషణ'.. 2026లో తొలి ప్రయోగానికి మొదలైన
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో ఉంచితే దరిద్రం మీ వెంటే..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
అజ్ఞాత వ్యక్తి కష్టం అనగానే.. అర్థరాత్రి లుంగీలో వెళ్లిన హీరో..
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
సింగిల్‌ ప్లాన్‌తోనే 4 సిమ్‌లు యాక్టివ్‌.. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌,
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
పులి పంజా విసిరినా వెనక్కి తగ్గని శునకం.. పోరాటి యజమానిని కాపాడి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మొక్కజొన్నను ఇష్టంగా తింటున్నారా..? మీరు ఈ విషయం తెలుసుకోవాలి
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
మేడారం జాతరలో మానవత్వం చాటుకున్న మంత్రి సీతక్క
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
ఆ స్టార్ హీరో పై ప్రశంసలు కురిపించిన జయసుధ
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..
దీర్ఘాయుష్షు రహస్యం మీ చేతుల్లోనే.. ఈ చిన్న మార్పులు చేసుకుంటే..