భారత్‌పై దాడులకు పాక్ జైషే సంస్థను వాడుతోంది: ముషార్రఫ్

భారత్‌పై దాడులు చేసేందుకు ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌ను పాక్ ఇంటెలిజెన్స్ సర్వీస్ వినియోగిస్తుందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ జర్నలిస్ట్ నదిమ్ మాలిక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. తన పాలనలో కూడా భారత్‌పై దాడుల కోసం జైషే సంస్థను ఇంటెలిజెన్స్ వాడుతుండేదని ఆయన పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో జైషే సంస్థ తనను రెండు సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. […]

భారత్‌పై దాడులకు పాక్ జైషే సంస్థను వాడుతోంది: ముషార్రఫ్
Follow us

| Edited By:

Updated on: Mar 07, 2019 | 10:00 AM

భారత్‌పై దాడులు చేసేందుకు ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌ను పాక్ ఇంటెలిజెన్స్ సర్వీస్ వినియోగిస్తుందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ జర్నలిస్ట్ నదిమ్ మాలిక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. తన పాలనలో కూడా భారత్‌పై దాడుల కోసం జైషే సంస్థను ఇంటెలిజెన్స్ వాడుతుండేదని ఆయన పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో జైషే సంస్థ తనను రెండు సార్లు హత్య చేసేందుకు ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు.

అయితే మీ పాలనతో ఉగ్ర సంస్థలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆ జర్నలిస్ట్ ముషార్రఫ్‌ను ప్రశ్నించగా.. అప్పటి పరిస్థితులు చాలా భిన్నమైనవి.. ఆ కాలంలో భారత్, పాక్‌లు రహస్యంగా పోరాడేవని వ్యాఖ్యానించారు. ఉగ్ర నివారణ చర్యల్లో భాగంగా జైషే మహ్మద్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తాను కూడా అందుకోసం ఒత్తిడి తీసుకురాలేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

Latest Articles