కాంగ్రెస్‌లోకి హార్దిక్ పటేల్
పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 12న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పటేల్ ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నాడని సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన హార్దిక్, గుజరాత్ జామ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పటేల్ పార్టీలో చేరుతున్న సందర్భంగా అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ మీటింగ్‌ను ఏర్పాటు చేసి అనంతరం పార్టీ సీనియర్ నాయకులతో పబ్లిక్ […]

పటీదార్ రిజర్వేషన్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ నెల 12న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో పటేల్ ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నాడని సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన హార్దిక్, గుజరాత్ జామ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు పటేల్ పార్టీలో చేరుతున్న సందర్భంగా అహ్మదాబాద్‌లో సీడబ్ల్యూసీ మీటింగ్‌ను ఏర్పాటు చేసి అనంతరం పార్టీ సీనియర్ నాయకులతో పబ్లిక్ ర్యాలీని నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.