ఐటీ గ్రిడ్ వివాదంపై విజయశాంతి సీరియస్
హైదరాబాద్: ఐటీ గ్రిడ్ వివాదంపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సీరియస్ అయ్యారు. కేసు దర్యాప్తును తెలంగాణ ప్రభుత్వం సిట్‌కు అప్పగించడాన్ని తప్పుపట్టారు. పొరుగు రాష్ట్రంలోని వివాదానికి సిట్ వేయడమేంటని ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఎంత చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. పొరుగు రాష్ట్రంలో అయితే సిట్ ఏర్పాటు, స్వరాష్ట్రంలో అయితే సిట్ అని ప్రతిపక్షాల గొంతు నొక్కుతారని ఆమె మండిపడ్డారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు […]

హైదరాబాద్: ఐటీ గ్రిడ్ వివాదంపై కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి సీరియస్ అయ్యారు. కేసు దర్యాప్తును తెలంగాణ ప్రభుత్వం సిట్‌కు అప్పగించడాన్ని తప్పుపట్టారు. పొరుగు రాష్ట్రంలోని వివాదానికి సిట్ వేయడమేంటని ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని కాంగ్రెస్ పార్టీ ఎంత చెప్పినా పట్టించుకోలేదని అన్నారు.
పొరుగు రాష్ట్రంలో అయితే సిట్ ఏర్పాటు, స్వరాష్ట్రంలో అయితే సిట్ అని ప్రతిపక్షాల గొంతు నొక్కుతారని ఆమె మండిపడ్డారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఐటీ గ్రిడ్‌పై గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసిన కాసేపటికే తెలంగాణ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించడంపై అనుమానం కలిగేలా ఉందన్నారు. మోడీ ముసుగులో తెలుగు రాష్ట్రాల్లో జరగుతున్న కుట్రకు ఇంతకు మించిన ఉదాహరణ లేదని విజయశాంతి ఆరోపించారు.