ధర్మ పోరాట దీక్ష

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని ఎ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చని కారణంగా ఎ.పి సిఎం చంద్రబాబు నాయుడు డిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దేశ రాజధానిలో కోలాహలం నెలకొంది. ఎపి నుంచి పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు తరలి వచ్చాయి. ఈ దీక్షకు పలు జాతీయ పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. దీక్షా స్థలిలో నేతల ప్రసంగాలు కొనసాగుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తదితరులు చంద్రబాబును కలిసి దీక్షకు మద్దతు […]

ధర్మ పోరాట దీక్ష

ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని ఎ ఒక్క హామీని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చని కారణంగా ఎ.పి సిఎం చంద్రబాబు నాయుడు డిల్లీలో ధర్మపోరాట దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా దేశ రాజధానిలో కోలాహలం నెలకొంది. ఎపి నుంచి పెద్ద ఎత్తున టిడిపి శ్రేణులు తరలి వచ్చాయి. ఈ దీక్షకు పలు జాతీయ పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి. దీక్షా స్థలిలో నేతల ప్రసంగాలు కొనసాగుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తదితరులు చంద్రబాబును కలిసి దీక్షకు మద్దతు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  చేపట్టిన ధర్మపోరాట దీక్షకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా ఈరోజు రాత్రి 8 గంటల వరకు చంద్రబాబు దీక్ష చేయనున్నారు.

విభజన హక్కుల సాధన కోసం గత ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నామని ఎంపీ బుట్టారేణుక అన్నారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఏపీకి రావాల్సిన హామీలపై కేంద్రం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆమె ఆరోపించారు.

Published On - 6:23 pm, Mon, 11 February 19

Click on your DTH Provider to Add TV9 Telugu