ఉధృతమవుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం.. మద్దతు ప్రకటించిన రైతు ఉద్యమ నేత రాకేశ్ తికాయత్
విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. కార్మిక ఉద్యమానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది.
rakesh tikait supports vizag steel plant movement : విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. కార్మిక ఉద్యమానికి క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు, స్వచ్చంధ సంఘాలు, కార్మిక సంఘాలతోపాటు పలువురు ప్రముఖులు స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ప్రకటించాయి. ఈనేపథ్యంలోనే తాజాగా ఉక్కు ఉద్యమానికి భారతీయ కిసాన్ యూనియన్ మద్దతు ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అమలంభిస్తుందని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న 26 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించాలని చూస్తోందని తికాయత్ ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసేందుకు యత్నిస్తోందని ఆయన మండిపడ్డారు.
ఇదిలావుంటే, దేశ రాజధాని సరిహద్దులో అన్నదాతల ఆందోళన కొనసాగుతూనే ఉంది. నూతన వ్యవసాయసాగు చట్టాలను నిరసిస్తూ.. ఢిల్లీలో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న తికాయత్.. కొత్త సాగు చట్టాలు రైతులకు ఆమోదయోగ్యం కావన్నారు. వీటిని రద్దు చేయకపోవడానికి కారణాలేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు, బెంగాల్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ఆయన అక్కడి ప్రజలను కోరారు. దేశ రాజధానిలో ఎంత కాలంపాటు నిరసనలు సాగించాలనే విషయమై నిర్ణయం తీసుకోలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని తికాయత్ స్పష్టం చేశారు.
Read Also.. ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. 20 ఓవర్లకు 186 పరుగులు.. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సూర్యకుమార్..