Big Shock నిమ్మగడ్డకు బిగ్ షాక్.. రివర్సయిన సొంత పీఎస్

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవీచ్యుతుడైన నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు తాజగా పెద్ద షాక్ తగిలింది. ఆ షాక్ కూడా తన దగ్గర పని చేసిన సొంత పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) ద్వారా తగలడం విశేషం. పీఎస్ ఇచ్చిన సమాచారంతో సీఐడీ విచారణ కీలక మలుపు తిరిగింది.

Big Shock నిమ్మగడ్డకు బిగ్ షాక్.. రివర్సయిన సొంత పీఎస్
Follow us

|

Updated on: Apr 24, 2020 | 4:52 PM

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవీచ్యుతుడైన నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు తాజగా పెద్ద షాక్ తగిలింది. ఆ షాక్ కూడా తన దగ్గర పని చేసిన సొంత పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) ద్వారా తగలడం విశేషం. పీఎస్ ఇచ్చిన సమాచారంతో సీఐడీ విచారణ కీలక మలుపు తిరిగింది.

నిమగడ్డ రమేష్ కుమార్ లేఖపై చెలరేగిన వివాదంలో శుక్రవారం పెద్ద ట్విస్టు తలెత్తింది. ఈ లేఖ బయటి నుంచి వచ్చినట్లు వస్తున్న వాదనకు బలం చేకూరే పరిణామం చోటుచేసుకుంది. ఈ లేఖ బయటి నుంచి వచ్చినట్లుగా ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. తనకు రక్షణ లేదంటూ కేంద్ర హోం శాఖకు నిమ్మగడ్డ లేఖ రాశారని, రాయలేదని పలు రకాల వాదనలు గత నెల రోజులుగా వినిపిస్తూనే వున్నాయి. ఈ క్రమంలో ఈ లేఖ తాలూకు ఆధారాలను ధ్వంసం చేసినట్లు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దగ్గర పని చేసిన అడిషనల్ పీ.ఎస్. సాంబమూర్తి అంగీకరించారు.

లేఖ తానే రాసినట్లయితే లేఖ అసలు ప్రతిని ఎందుకు ధ్వంసం చేశారన్నది తాజగా వినిపిస్తున్న ప్రశ్న. ల్యాప్ టాప్‌లో ఆ లేఖ తయారు చేసి పెన్ డ్రైవ్ ద్వారా లేఖను డెస్క్ టాప్ లో వేసినట్టు చెప్పారు సాంబమూర్తి. ఆ లేఖను ఎవరో డ్రాఫ్ట్ చేసి.. వెబ్ వాట్సాప్ ద్వారా రమేష్ కుమార్‌కు పంపినట్లు తెలుస్తోంది. ఆ లేఖను లాప్ టాప్ నుంచి మొబైల్‌లోకి తీసుకుని, ఆ తర్వాత మొబైల్ నుంచి కేంద్ర హోం శాఖకు నిమ్మగడ్డకు పంపారని భావిస్తున్నారు.

ల్యాప్‌టాప్‌లో ఫైల్స్ డిలీట్ చేయడంతో పాటు పెన్ డ్రైవ్ ధ్వంసం చేశారు. డెస్క్ టాప్ కూడా ఫార్మాట్ చేశారు.. లేఖకు సంబంధించి అన్ని ఆధారాలు ఎందుకు ధ్వంసం చేశారో తెలియదని పీఎస్ సీఐడికి వాంగ్మూలం ఇచ్చారు. విజయ సాయి రెడ్డి చెప్పినట్లు లేఖ బయట నుండి వచ్చి ఉండే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. ఆధారాలను ట్యంపర్ చేసిన అంశంపై కేసు నమోదు చేశామని సీఐడీ అధికారులు తెలిపారు. లేఖ నంబర్‌పైన కూడా కొన్ని ఆధారాలు సేకరించామని తెలిపారు.

కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ రాసిన లేఖ నంబర్ 221… అదే నంబర్ అశోక్ బాబు రాసిన లేఖకు రెఫరెన్సుగా కూడా వుంది. దాంతో అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో పీఎస్ వాంగ్మూలం ఆధారంగా సీఐడీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను కూడా విచారించే అవకాశాలున్నాయని సమాచారం.