Anandaiah Medicine: ఆనందయ్య మందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..! ఆ మందుకు తప్ప..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కృష్ణపట్నం ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుపై ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Anandaiah Medicine: ఆనందయ్య మందుకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..! ఆ మందుకు తప్ప..!
Anandaiah Medicine
Follow us
Sanjay Kasula

|

Updated on: May 31, 2021 | 2:46 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కృష్ణపట్నం ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందుపై ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ( CCRAS) క‌మిటీ నివేదిక ప్ర‌కారం ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది. కంట్లో వేస్తున్న మందుకు త‌ప్ప ఆనంద‌య్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్‌కు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. అవి రావ‌డానికి 2- 3 వారాలు స‌మ‌యం ప‌డుతుంద‌ని వివ‌రించింది. కె అనే మందును క‌మిటీ ముందు ప్రదర్శించనందున సీసీఆర్‌ఏఎస్‌ దీనికి నిరాక‌రించింది. ఆనంద‌య్య మందు వాడితే క‌రోనా త‌గ్గుతుంద‌నడానికి నిర్ధార‌ణ‌లు లేవ‌ని నివేదిక‌లు తేల్చాయి.

కె అనే మందును కూడా కమిటీ ముందు చూపించలేదు కాబట్టి దీనికి నిరాకరించింది. అయితే ఆనందయ్య ఇచ్చే పి.ఎల్.ఎఫ్‌ మందులను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే కంట్లో వేసు మందుపై ఇంకా నివేదిక రాకపోవడంతో ఈ మందుపై నిర్ణయంను రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది.

ఆనందయ్య మందు వాడితే హాని లేదని సీసీఆర్‌ఏఎస్‌ నివేదిక తేల్చింది. అంతే కాదు నివేదికలు ఆనందయ్య ఇస్తున్న మిగిలిన మందుల వల్ల ఎలాంటి హాని లేదని కూడా నివేదికల్లో పేర్కొనడంతో రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెప్పింది. కాని, ఆనందయ్య మందు వాడితే కోవిడ్‌ తగ్గుతుంది అనడానికి నిర్ధారణలు ఏవీ లేవని కూడా నివేదికల్లో పేర్కొంది.

కంట్లో వేసే డ్రాప్స్‌ విషయంలో పూర్తి నివేదికలు రావడానికి మరో రెండు, మూడు వారాలు పట్టే అవకాశం ఉందని తెలిపింది. ఆనందయ్య మందు వాడినంత మాత్రాన మిగిలిన మందులు ఆపొద్దని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను విజ్ఞప్తి చేసింది. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ.. ఎవరి ఇష్టానుసారం వారు ఆనందయ్య మందును వాడుకోవచ్చు సూచించింది.

ఆనందయ్య మందును తీసుకోవడానికి కోవిడ్‌ పాజిటివ్‌ రోగులు రాకుండా ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వం కోరింది. వారికి బదులు వారి సంబంధీకులు వచ్చి మందును తీసుకెళ్తే.. కోవిడ్‌ విస్తరించే ప్రమాదం తప్పుతుందని సూచించింది.

ఇవి కూడా చదవండి : Fingernails: చేతిగోళ్లపై అర్ధచంద్రాకారం.. గోళ్లను చూసి ఆరోగ్య సమస్యలు తెలుసుకోవచ్చు.. ఎలాగంటే..!

Croaker Fish: ఒక్క చేప‌తో వారి సుడి మారిపోయింది.. ఎంత‌కు అమ్మారో తెలిస్తే మైండ్ బ్లాంక్