AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతర్వేదిలో ఉట్టిపడిన ఆధ్యాత్మిక శోభ.. వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం

ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. భక్తులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. అత్యంత వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం నిర్వహించింది ఏపీ ప్రభుత్వం.

అంతర్వేదిలో ఉట్టిపడిన ఆధ్యాత్మిక శోభ.. వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం
Balaraju Goud
|

Updated on: Feb 23, 2021 | 7:13 AM

Share

Antarvedi kalyanam : అంతర్వేదిలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది. భక్తులు భక్తి పారవశ్యంలో మునిగితేలారు. అత్యంత వైభవంగా అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

తూర్పుగోదావరి జిల్లా సంగమ క్షేత్రంలో అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవం వైభవంగా సాగింది. కల్యాణం తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. రాత్రి 11 గంటల 19 నిమిషాలకు వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ కల్యాణం కమనీయంగా సాగింది. ఆలయ పరిసరాలు భక్తజన సందోహంగా మారాయి. శుక్రవారం నుంచి ఆలయంలో కల్యాణోత్సవాలు జరుగుతుండగా.. ఇవాళ రథోత్సవం నిర్వహించనున్నారు.

ఇదిలావుంటే, సెప్టెంబర్ నెలలో షెడ్డులో భద్రపరచిన లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధమైంది. 60 ఏండ్ల క్రితం టేకుతో 40 అడుగుల ఎత్తున్న రథాన్ని తయారు చేయించారు. రథం దగ్ధం కావడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. రథం మంటల్లో కాలిపోవడంతో.. 2021లో అంతర్వేది రథోత్సవం.. కొత్త రథంతోనే నిర్వహిస్తామని భక్తులకు హామీ ఇచ్చారు సీఎం జగన్. చెప్పినట్లుగానే కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన రథాన్ని నాలుగు రోజుల క్రితం రథసప్తమి రోజున పూజలు చేసి ప్రారంభించారు. ఐదు నెలల్లో అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా భవ్యమైన నూతన రథం నిర్మాణం పూర్తి చేసి.. లక్ష్మీ నరసింహస్వామికి సమర్పించారు. ఇప్పుడు అంతే ఘనంగా కల్యాణోత్సవాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం.

ఇదీ చదవండిః ఇవాళ్టి నుంచి జేఈఈ మెయిన్ పరీక్ష.. రెండు గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.. కోవిడ్ నిబంధనలు తప్పనిసరి..