‘భారతీయుడు 2’పై అనిరుథ్ ఆసక్తికర విషయం

‘భారతీయుడు 2’పై అనిరుథ్ ఆసక్తికర విషయం

కమల్ హాసన్ ప్రధానపాత్రలో శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘భారతీయుడు 2’. సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వాటిలో నిజం లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన పాటల గురించి సంగీత దర్శకుడు అనిరుధ్ ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఈ చిత్రం కోసం రెండేళ్ల క్రితం పాటలు సిద్ధమైనట్లు అనిరుధ్ తెలిపాడు. 2017లోనే శంకర్ తనకు ఇండియన్ 2 […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 26, 2019 | 10:52 AM

కమల్ హాసన్ ప్రధానపాత్రలో శంకర్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘భారతీయుడు 2’. సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వాటిలో నిజం లేదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన పాటల గురించి సంగీత దర్శకుడు అనిరుధ్ ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. ఈ చిత్రం కోసం రెండేళ్ల క్రితం పాటలు సిద్ధమైనట్లు అనిరుధ్ తెలిపాడు.

2017లోనే శంకర్ తనకు ఇండియన్ 2 కథను వినిపించాడని.. అప్పుడు చెప్పిన కొన్ని సన్నివేశాలకు ట్యూన్లు కూడా కట్టినట్లు అనిరుధ్ చెప్పుకొచ్చాడు. మిగిలిన బాణీలు కూడా త్వరలోనే పూర్తి చేస్తానని అనిరుధ్ తెలిపాడు. కాగా ఈ చిత్రంలో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. సిద్ధార్థ్, నెడుముడివేలలు కీలక పాత్రలలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu