AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సరిహద్దులో యుద్ధం.. స్వయంగా రంగంలోకి దిగిన మోడీ!

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో వెయ్యి కేజీల బాంబులతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేసింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది. ఈ విషయం బయటకొచ్చిన వెంటనే పాకిస్థాన్ తిప్పి కొట్టామని ఖండించగా భారత ఆర్మీ నిదానంగా దాడిని దృవీకరించింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా భారత ఆర్మీ అధికారులు, వాయిసేన […]

సరిహద్దులో యుద్ధం.. స్వయంగా రంగంలోకి దిగిన మోడీ!
Vijay K
|

Updated on: Feb 26, 2019 | 10:42 AM

Share

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార దాడి చేసింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో వెయ్యి కేజీల బాంబులతో ఉగ్రవాదులపై భారత్ దాడి చేసింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల 30 నిమిషాల సమయంలో ఈ దాడి జరిగింది. ఈ విషయం బయటకొచ్చిన వెంటనే పాకిస్థాన్ తిప్పి కొట్టామని ఖండించగా భారత ఆర్మీ నిదానంగా దాడిని దృవీకరించింది.

ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా భారత ఆర్మీ అధికారులు, వాయిసేన అధికారులతో సమావేశమై చర్చలు జరుపుతున్నారు. తదుపరి జరగాల్సిన చర్యలపై మాట్లాడుతున్నారని తెలుస్తోంది. రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌తో, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు ఇతర కీలక జాతీయ నేతలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నేతృత్వంలో కీలక వ్యూహాలు రూపొందుతున్నట్టు కూడా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పుల్వామా ఉగ్రదాడిలో 40కి పైగా భారత జవాన్లు కన్నుమూసిన వెంటనే ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. ఉగ్రవాదులు చాలా పెద్ద తప్పు చేశారని, ఖచ్చితంగా బదులు ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్మీకి పూర్తి స్థాయి స్వేచ్ఛను కూడా ఆయన ప్రకటించారు. దీంతో దాడి జరిగిన ఫిబ్రవరి 14 నుంచి నేటి వరకు భారత్-పాక్ మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Follow Us
చదువుకోవటానికి వయస్సుతో పనిలేదని నిరూపించిన గృహిణి
చదువుకోవటానికి వయస్సుతో పనిలేదని నిరూపించిన గృహిణి
నేరెడు పండ్లు వీరికి విషంతో సమానం.. తింటే ప్రాణాలకే డేంజర్..
నేరెడు పండ్లు వీరికి విషంతో సమానం.. తింటే ప్రాణాలకే డేంజర్..
5 కోట్లతో తీస్తే 220 కోట్లకు పైనే.. ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ
5 కోట్లతో తీస్తే 220 కోట్లకు పైనే.. ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ మూవీ
మద్యం మత్తులో పెను విషాదం.. ఆవేశంలో తండ్రీకొడుకుల ఆత్మహత్య
మద్యం మత్తులో పెను విషాదం.. ఆవేశంలో తండ్రీకొడుకుల ఆత్మహత్య
డీజిల్‌పై సుంకం తగ్గింపు.. కేంద్రం కీలక నిర్ణయం
డీజిల్‌పై సుంకం తగ్గింపు.. కేంద్రం కీలక నిర్ణయం
'జెట్లీ' రివ్యూ.. సత్య, వెన్నెల కిషోర్ నవ్వుల ప్రయాణం ఎలా ఉందంటే?
'జెట్లీ' రివ్యూ.. సత్య, వెన్నెల కిషోర్ నవ్వుల ప్రయాణం ఎలా ఉందంటే?
వాటర్ ట్యాంక్‌లో ఇవి వేస్తే నాచు అనేదే ఉండదు.. పూర్వీకుల నేచురల్
వాటర్ ట్యాంక్‌లో ఇవి వేస్తే నాచు అనేదే ఉండదు.. పూర్వీకుల నేచురల్
వ్యభిచార కేసులో ఇరుక్కుని కెరీర్ నాశనం..
వ్యభిచార కేసులో ఇరుక్కుని కెరీర్ నాశనం..
గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. నేటి నుంచే..
గ్యాస్ సిలిండర్ బుకింగ్ రూల్స్‌లో కీలక మార్పులు.. నేటి నుంచే..
ఓటీటీలో గత్తరలేపుతున్న సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..
ఓటీటీలో గత్తరలేపుతున్న సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..