ఏపీలో భూముల సమగ్ర రీసర్వేపై క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏళ్లుగా నెలకొన్న రెవెన్యూ సంబంధిత సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్ర ప్రజలకు సులభతరమైన రెవెన్యూ సేవలు అందించడమే కమిటీ ఉద్దేశ్యమని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే, పక్కగా భు రికార్డులు పరిశీలన.. సూచనలు చేస్తామని వెల్లడించింది. గురువారం అమరావతిలోని సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమీక్ష నిర్వహించింది. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్, మంత్రులు కురసాల కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, సిసిఎల్ఎ నిరబ్ కుమార్ ప్రసాద్, […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏళ్లుగా నెలకొన్న రెవెన్యూ సంబంధిత సమస్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. రాష్ట్ర ప్రజలకు సులభతరమైన రెవెన్యూ సేవలు అందించడమే కమిటీ ఉద్దేశ్యమని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీసర్వే, పక్కగా భు రికార్డులు పరిశీలన.. సూచనలు చేస్తామని వెల్లడించింది. గురువారం అమరావతిలోని సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమీక్ష నిర్వహించింది.
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్, మంత్రులు కురసాల కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, సిసిఎల్ఎ నిరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ సెక్రటరీ ఉష రాణి, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ భూములను అతి తక్కువ నామినల్ రుసుము చెల్లించి కన్వెర్ట్ చేసి కోట్ల రూపాయిలు ఆర్జిస్తున్నారని సమావేశంలో చర్చించారు.
భూ రికార్డుల ప్రక్షాళన చేస్తూ లిటిగేషన్లు తగ్గించేలా అందరికీ ఆమోయోగ్యమైన సూచనలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. 22A క్రింద ఉన్న భూములపై సరైన రీతిలో అధ్యయనం చేయాలని.. ఎస్టేట్, ఇనం భూముల పై సుదీర్ఘ చర్చ జరిపి వీటిపై సరైన నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు. క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకునేందుకు ఒక నెల రోజులు స్పందన ఫిర్యాదులను అధ్యయనం చేయాలని కూడా నిర్ణయానికి వచ్చారు.