విషం తాగి భర్త ఆత్మహత్య.. చెరువులో దూకిన భార్య, ఇద్దరు పిల్లలు..

హర్యానా రాష్ట్రంలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకోగా, భర్త మరణం తట్టుకోలేక భార్య‌, ఇద్ద‌రు కూతుళ్లు చెరువులో దూకి ఆత్మహత్య పాల్పడ్డారు.

విషం తాగి భర్త ఆత్మహత్య.. చెరువులో దూకిన భార్య, ఇద్దరు పిల్లలు..
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 24, 2020 | 2:47 PM

హర్యానా రాష్ట్రంలో ఓ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ ఆత్మ‌హ‌త్య చేసుకోగా, భర్త మరణం తట్టుకోలేక భార్య‌, ఇద్ద‌రు కూతుళ్లు చెరువులో దూకి ఆత్మహత్య పాల్పడ్డారు. ఈ ఉదంతంలో భార్య, భర్తలతోపాటు నాలుగేళ్ల చిన్నారి మృతి చెందగా, పదేళ్ల మరో అమ్మాయి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హ‌ర్యానాలోని రోహ‌త‌క్‌ ప్రాంతానికి చెందిన ప్ర‌మోద్ ష‌హార‌ణ్(38) స్థానికంగా ఉన్న ఓ న‌ర్సింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్నాడు. ప్ర‌మోద్ భార్య మీనాక్షి కూడా లెక్చ‌ర‌ర్ గా పనిచేస్తోంది. వీరికి ఎన్నా(10), ప్రీశా(4) అనే ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. అయితే బుధవారం ప్ర‌మోద్ బుధ‌వారం విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వ‌స్తూనే మార్గ‌మ‌ధ్య‌లోనే విషం సేవించి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆత్మ‌హ‌త్య కంటే ముందు ఈ విష‌యాన్ని త‌న స్నేహితుల‌కు వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియ‌జేశాడు. దీంతో మిత్రులు హుటాహుటిన అక్క‌డికి చేరుకుని ప్ర‌మోద్‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్లిన‌ప్ప‌టికీ, అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్దారించారు.

భ‌ర్త ఆత్మ‌హ‌త్య విష‌యం మీనాక్షికి తెలియడంతో.. ఆమె కూడా త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌ను తీసుకుని స్థానికంగా ఉన్న చెరువులో పిల్ల‌ల‌ను తోసేసి ఆమె దూకింది. మీనాక్షి, ప్రీశా నీటిలో మునిగిపోగా, ఎన్నా ప్రాణాల‌తో ఒడ్డుకు చేరింది. ప్రాణాలతో బయటపడ్డ ఎన్నా స్థానికులకు సమాచారమిచ్చింది. దీంతో వారు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. చెరువులో నుంచి మీనాక్షి, ప్రీశా మృత‌దేహాల‌ను గురువారం ఉద‌యం వెలికితీశారు. అయితే ప్ర‌మోద్‌, మీనాక్షి ఆత్మ‌హ‌త్య‌ల‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు తెలిపారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

అతిపెద్ద ఆటో షోకు వేదికైన ఢిల్లీ.. టాప్ కంపెనీల క్యూ
అతిపెద్ద ఆటో షోకు వేదికైన ఢిల్లీ.. టాప్ కంపెనీల క్యూ
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం
ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టంగా భారత్.. కేంద్రం
అరంగేట్రంలో 5 వికెట్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఆర్‌సీబీలోకి ఎంట్రీ
అరంగేట్రంలో 5 వికెట్లతో ఊచకోత.. కట్ చేస్తే.. ఆర్‌సీబీలోకి ఎంట్రీ
నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి..
నేను లోకల్, హలో గురు ప్రేమ కోసమే సినిమాలు నేను చేయాల్సినవి..
ప్రతిరోజూ షేవింగ్ చేసుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
ప్రతిరోజూ షేవింగ్ చేసుకుంటున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!
పెట్టుబడితో ఆదాయపు పన్ను ఆదా.. టాప్ స్కీమ్స్ ఇవే..!
పెట్టుబడితో ఆదాయపు పన్ను ఆదా.. టాప్ స్కీమ్స్ ఇవే..!
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా నేను రెడీ: మాజీ ప్లేయర్
టీమిండియా బ్యాటింగ్ కోచ్‌గా నేను రెడీ: మాజీ ప్లేయర్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. కేబినెట్ ఆమోదం!
పాన్ కార్డు అప్‌డేట్ పేరుతో కొంప ముంచేస్తున్నారు..!
పాన్ కార్డు అప్‌డేట్ పేరుతో కొంప ముంచేస్తున్నారు..!
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏటీఎంలో డబ్బులు నింపేందుకు వచ్చిన సిబ్బందిపై కాల్పులు జరిపి...
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
ఏందిరా ఇది.. అనౌన్స్‌మెంట్ టీజరే ఇలా ఉంటే మరి సినిమా?
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
50 సెకండ్ల షూట్‌కు రూ.5 కోట్ల ఫీజు.. డబ్బుల దగ్గర నో కథల్‌
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
వెంకీ సినిమాకు నెవ్వర్ బిఫోర్ ఓపెనింగ్స్
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గ్లామర్, సెలబ్రిటీ హోదా.. అన్నింటినీ వదిలి సాధ్విగా కుంభమేళాలో..
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
గేమ్‌ ఛేంజర్‌ గురించి అవాక్కయ్యేలా మాట్లాడిన జానీ మాస్టర్ కొడుకు
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
ప్రతి రోజు సమాధులకు నీళ్లు పోస్తున్న యువకుడు.. వెళ్లి చూడగా
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
బిడ్డను రైల్లోనే వదిలి పాలకోసం ట్రైన్‌ దిగిన తల్లి.. ఇంతలోనే..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
కాళ్లు, మూతులు కుట్టి.. 40 అడుగుల బ్రిడ్జ్ పై నుంచి విసిరేసి..
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??
ఫేస్ బుక్ ఖాతాలు డిలీట్ చేస్తున్న యూజర్లు.. ఎందుకంటే ??