AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: పాలు మరిగించే సరికొత్త పద్ధతి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కిచెన్ హ్యాక్!

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రజలు చిన్న విషయాన్ని ఎప్పుడు ఎలా పెద్దది చేస్తారో ఊహించడం అసాధ్యం. ప్రతిరోజూ ఇలాంటి అనేక వీడియోలు వెలుగులోకి వస్తాయి. వాటిలో కొన్ని దిగ్భ్రాంతి కలిగిస్తే, మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక పాత్రలో పాలు మరిగినప్పుడు కలిగే పరిణామాలను చూసి ప్రజలు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన కొందరు సానుభూతి వ్యక్తం చేయగా, మరికొందరు సరైన పాత్రలను ఉపయోగించమని సలహా ఇచ్చారు. ఇంతకీ వైరల్‌ వీడియోలో ఏముంది..?

Viral Video: పాలు మరిగించే సరికొత్త పద్ధతి.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కిచెన్ హ్యాక్!
Milk Boiling Hack
Jyothi Gadda
|

Updated on: Jul 23, 2026 | 8:13 PM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో ప్రజలు చిన్న విషయాన్ని ఎప్పుడు ఎలా పెద్దది చేస్తారో ఊహించడం అసాధ్యం. ప్రతిరోజూ ఇలాంటి అనేక వీడియోలు వెలుగులోకి వస్తాయి. వాటిలో కొన్ని దిగ్భ్రాంతి కలిగిస్తే, మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. అలాంటి ఒక వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక పాత్రలో పాలు మరిగినప్పుడు కలిగే పరిణామాలను చూసి ప్రజలు తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో చూసిన కొందరు సానుభూతి వ్యక్తం చేయగా, మరికొందరు సరైన పాత్రలను ఉపయోగించమని సలహా ఇచ్చారు. ఇంతకీ వైరల్‌ వీడియోలో ఏముంది..?

మన దేశంలో పాలు కాచడం అనేది ప్రతి ఇంట్లో ప్రతిరోజూ జరిగే సాధారణ ప్రక్రియ. అయితే, తాజా పాలను మరిగించేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల పాలు గిన్నె అడుగు భాగానికి అంటుకోవడం లేదా విరిగిపోవడం జరుగుతుంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఒక మహిళ షేర్‌ చేసిన వినూత్న వీడియా ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్ల మధ్య పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఒక వంటగదిలో మొదలవుతుంది. అక్కడ స్టవ్ మీద ఒక గిన్నెలో పాలు మరుగుతున్నాయి. మొదటి కొన్ని సెకన్ల పాటు అంతా సాధారణంగానే కనిపిస్తుంది. కానీ, మరుక్షణమే, ఎవరో గురిపెట్టినట్లుగా పాల గిన్నె స్టవ్ మీద అటూ ఇటూ ఎగిరిపడుతుంది. వీడియోలో, పాలు మరగడాన్ని చూపిస్తూ ఎవరో ఒక పాల ప్యాకెట్‌ను చూపిస్తారు. ఆ పాల ప్యాకెట్, దానితో పాటు ఉన్న బిల్లు వీడియో కూడా రికార్డ్ చేయబడింది. ఈ వీడియో వైరల్ అయిన వెంటనే నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్లు చేయటం మొదలుపెట్టారు.

సోషల్ మీడియా స్పందన, చర్చ:

ఈ వీడియో ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అవుతోంది. దీనిపై ప్రజలు రకరకాలుగా స్పందిస్తున్నారు. పాలను మరిగించడానికి ఒక పాత్రలో పోసి గ్యాస్ ఆన్ చేసినట్లు ఇందులో చూడవచ్చు. ఆ తర్వాత పాలు మరిగేటప్పుడు వాటిలో జరిగే మార్పులను వీడియో చూపిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియను కెమెరాలో బంధించి ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. ఇలాంటి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ వీడియో చూసిన ఒక యూజర్, బ్రో, ఆవు నిన్ను తన్నింది అని చమత్కరించారు. మరో యూజర్, పాకిస్తాన్ నుండి డెలివరీ అయింది అని రాశారు. మూడో యూజర్, ఈ పాత్ర పాలకు కాదు అని రాశారు. నాలుగో యూజర్, సమస్య పాత్రతో ఉంది, పాలతో కాదు అని రాశారు.

View this post on Instagram

A post shared by @cinenikhl

పాలను కాచేందుకు సరైన పద్ధతి:

వీడియో చూసిన చాలా మంది పాలను కాచేందుకు సరైన పద్ధతిని కూడా వివరించారు. తాజా పాలను మరిగించేటప్పుడు మంటను ఎక్కువగా పెట్టకూడదని, సిమ్ లో ఉంచి కలపడం వల్ల పాలు విరిగిపోకుండా, మంచి చిక్కటి మీగడ వస్తుందని పేర్కొన్నారు. పాలను మరిగించడానికి ఎల్లప్పుడూ మందపాటి అడుగు ఉన్న గిన్నెను ఉపయోగించాలి. పాలు పోసే ముందు గిన్నెలో నీళ్లు పోసి మరిగించి పడేయాలి. ఆ తరువాత పాలను ఒకేసారి ఎక్కువ మంటపై కాచకుండా, మధ్యస్థమైన మంటపై క్రమంగా వేడి చేయడం వల్ల అందులోని పోషకాలు దెబ్బతినవు. సాధారణంగా అనిపించే ఇలంటి చిన్న వంటగది చిట్కాలు మన సమయాన్ని, శ్రమను ఎంతగానో ఆదా చేస్తాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎర్రచందనం మాఫియాపై ఉక్కుపాదంః పవన్ కల్యాణ్
ఎర్రచందనం మాఫియాపై ఉక్కుపాదంః పవన్ కల్యాణ్
సైబర్ నేరగాళ్ల 'బాస్ స్కామ్'పై సెబీ కీలక హెచ్చరిక
సైబర్ నేరగాళ్ల 'బాస్ స్కామ్'పై సెబీ కీలక హెచ్చరిక
పాలు మరిగించే సరికొత్త పద్ధతి..సోషల్ మీడియాలో వైరల్ కిచెన్ హ్యాక్
పాలు మరిగించే సరికొత్త పద్ధతి..సోషల్ మీడియాలో వైరల్ కిచెన్ హ్యాక్
బడ్జెట్ ధరలో ఇన్ఫినిక్స్ సంచలనం..ఇన్ఫినిక్స్ హాట్ 70
బడ్జెట్ ధరలో ఇన్ఫినిక్స్ సంచలనం..ఇన్ఫినిక్స్ హాట్ 70
నాన్ వెజ్ తిన్న తర్వాత గుడికి ఎందుకు వెళ్లకూడదు?..
నాన్ వెజ్ తిన్న తర్వాత గుడికి ఎందుకు వెళ్లకూడదు?..
ఇంటి డోర్ దగ్గర ఇది పెడితే చాలు.. పాము తోకముడుచుకొని పారిపోతుంది
ఇంటి డోర్ దగ్గర ఇది పెడితే చాలు.. పాము తోకముడుచుకొని పారిపోతుంది
నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? పాటించా...
నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? పాటించా...
మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స.. ఇదెక్కడి చోద్యం!
మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స.. ఇదెక్కడి చోద్యం!
నా సినిమా బాగోకపోతే గుండు కొట్టించుకుంటా: జబర్దస్త్ కమెడియన్
నా సినిమా బాగోకపోతే గుండు కొట్టించుకుంటా: జబర్దస్త్ కమెడియన్
ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన!
ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన!