AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి డోర్ దగ్గర ఇది పెడితే చాలు.. పాము తోకముడుచుకొని పారిపోతుంది.. పూర్వీకుల సూపర్ సీక్రెట్..

పాము పేరు వింటేనే భయపడేవాళ్లు ఎంతో మంది. ఒకవేళ ఇంట్లోకి వస్తే పరుగో పరుగు. వర్షాకాలం ఈ పాముల బెడత ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలు వాడితే పాములను ఇంటి నుంచి దూరం పెట్టొచ్చు. ఓ గ్రామం మన వంటింట్లో దొరికే ఒక కూరగాయతో పాములకు చెక్ పెడుతున్నారు. ఆ విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఇంటి డోర్ దగ్గర ఇది పెడితే చాలు.. పాము తోకముడుచుకొని పారిపోతుంది.. పూర్వీకుల సూపర్ సీక్రెట్..
How To Keep Snakes Away During Rainy Season
Krishna S
|

Updated on: Jul 23, 2026 | 7:58 PM

Share

వర్షాకాలం వచ్చిందంటే చాలు వర్షపు నీటితో కలుగులు, పొదలు నిండిపోవడంతో పాములు సురక్షితమైన, పొడి ప్రదేశాల కోసం వెతుకుతూ ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లో కూడా వర్షాకాలంలో పాముల బెడద విపరీతంగా పెరుగుతుంది. అయితే ఈ సమస్య నుండి విముక్తి పొందడానికి ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, కప్‌కోట్ వంటి కొండ ప్రాంతాల్లో శతాబ్దాలుగా ఒక సాంప్రదాయ చిట్కాను పాటిస్తున్నారు. ఉల్లిపాయ తొక్కలతో పాములను ఎలా దూరంగా ఉంచవచ్చో, శాస్త్రీయంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకుందాం..

ఉల్లిపాయ తొక్కల జానపద చిట్కా

పూర్వకాలంలో పాములను తరిమికొట్టడానికి ఎలాంటి రసాయనాలు లేదా స్ప్రేలు అందుబాటులో లేకపోవడంతో గ్రామీణులు సహజ నివారణలపైనే ఆధారపడేవారు. ఎండిన ఉల్లిపాయ తొక్కలను ఇంటి మూలల్లో, తలుపుల ద్వారాల వద్ద ఉంచుతారు. ఉల్లిపాయ నుంచి వచ్చే తీవ్రమైన ఘాటైన వాసన పాములను భయపెట్టి దూరంగా ఉంచుతుందని నమ్ముతారు. ఈ ఉల్లిపాయ తొక్కలకు వేపాకులు, బూడిదను కలిపి వాడటం ద్వారా ఘాటు పెరిగి పాములు ఇంటి దరిదాపుల్లోకి రాకుండా చూసుకునేవారు.

పరిశుభ్రతే అసలైన నివారణ.. శాస్త్రం ఏం చెబుతోంది?..

కేవలం జానపద చిట్కాలపైనే ఆధారపడటం సరికాదని, పరిసరాల పరిశుభ్రత అత్యంత కీలకమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎలుకలను అరికట్టడం: పాములు ప్రధానంగా ఆహారం కోసం ఇళ్లలోకి వస్తాయి. ధాన్యం, బియ్యం, గోధుమలను గాలి చొరబడని డబ్బాలలో భద్రపరచి ఇంట్లో ఎలుకలు లేకుండా చూసుకుంటే, పాములు స్వయంచాలకంగా రావడం మానేస్తాయి.

చెత్త కుప్పలు, కట్టెల తొలగింపు: ఇంటి పరిసరాల్లో లేదా పెరట్లో ఎండిన కట్టెలు, ఇటుకలు, పాత చెత్త కుప్పలు పేరుకుపోనివ్వకూడదు. ఇవి పాములకు సురక్షితమైన దాగుడు స్థలాలుగా మారతాయి.

సందులు, పగుళ్లు మూసివేత: గోడలు, నేలల్లో ఉన్న పగుళ్లను, తలుపుల కింద ఉండే సందులను మూసివేయాలి. పొదలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి.

పాము కనిపిస్తే ఏం చేయాలి?

ఇంట్లో లేదా ఆవరణలో అకస్మాత్తుగా పాము కనిపిస్తే భయాందోళనకు గురికావద్దు. దానిని సొంతంగా పట్టుకోవడానికి లేదా చంపడానికి ప్రయత్నించకుండా సురక్షితమైన దూరంలో ఉండాలి. తక్షణమే అటవీ శాఖకు లేదా స్నేక్ క్యాచర్లకు సమాచారం అందించాలి. గుర్తుంచుకోండి, అన్ని పాములూ విషపూరితమైనవి కావు. ఒకవేళ ఎవరినైనా పాము కాటు వేస్తే ఉల్లిపాయ తొక్కలు, మంత్రాలు, మూలికల పేరుతో సమయం వృథా చేయకూడదు. బాధితుడిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి. యాంటీ వెనమ్ ఇంజెక్షన్, సరైన వైద్య చికిత్స మాత్రమే బాధితుడి ప్రాణాలను కాపాడగలవు.

(గమనిక: ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం సమాచారం, సాంప్రదాయక జానపద నమ్మకాల ఆధారంగా అందించబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.  ఒకవేళ పాము కాటు వేస్తే ఎలాంటి మూలికా చికిత్సలను నమ్మకుండా తక్షణమే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం మంచిది.)

Follow Us
ఇంటి డోర్ దగ్గర ఇది పెడితే చాలు.. పాము తోకముడుచుకొని పారిపోతుంది
ఇంటి డోర్ దగ్గర ఇది పెడితే చాలు.. పాము తోకముడుచుకొని పారిపోతుంది
నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? పాటించా...
నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? పాటించా...
మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స.. ఇదెక్కడి చోద్యం!
మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స.. ఇదెక్కడి చోద్యం!
నా సినిమా బాగోకపోతే గుండు కొట్టించుకుంటా: జబర్దస్త్ కమెడియన్
నా సినిమా బాగోకపోతే గుండు కొట్టించుకుంటా: జబర్దస్త్ కమెడియన్
ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన!
ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన!
క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా..?
క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా..?
విద్యార్థులను అడ్డుపెట్టుకుని విపక్షాల కుట్ర..
విద్యార్థులను అడ్డుపెట్టుకుని విపక్షాల కుట్ర..
పూజా మందిరంలో ఈ వాస్తు తప్పులు చేస్తున్నారా? దేవతల విగ్రహాల విషయం
పూజా మందిరంలో ఈ వాస్తు తప్పులు చేస్తున్నారా? దేవతల విగ్రహాల విషయం
6,6,6,6,4,4,4,4.. 18 బంతుల్లో ఫిఫ్టీ.. హరారేలో బుడ్డోడి అరాచకం..
6,6,6,6,4,4,4,4.. 18 బంతుల్లో ఫిఫ్టీ.. హరారేలో బుడ్డోడి అరాచకం..
పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న
పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న