AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking రాజధాని తరలింపుపై స్టేటస్ కో.. హైకోర్టు ఆదేశం

ఏపీ రాజధాని తరలింపుపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజధాని తరలింపుపై యధాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు...

Breaking రాజధాని తరలింపుపై స్టేటస్ కో.. హైకోర్టు ఆదేశం
Sanjay Kasula
|

Updated on: Aug 04, 2020 | 4:29 PM

Share

Andhra high-court imposes status-quo on capital shifting : ఏపీ రాజధాని తరలింపుపై రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజధాని తరలింపుపై యధాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించింది. ఈ పిటిషన్‌పై మంగళవారం వాదోపవాదాలు జరిగాయి. పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ధర్మాసనం అడ్వకేట్ జనరల్‌ను ఆదేశించగా.. ఆయన పదిరోజుల గడువు కావాలని కోరారు.

అయితే.. పది రోజుల గడువులోగా రాజధాని తరలింపును ప్రభుత్వం కొనసాగించే అవకాశం వుందని పిటిషనర్ ధర్మాసనానికి నివేదించడంతో రాజధాని తరలింపుపై యధాతథ స్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో రాష్ట్ర గవర్నర్ జారీ చేసిన గెజిట్‌కు బ్రేక్ పడినట్లయ్యింది. 10 రోజులపాటు స్టేటస్‌ కో ఉత్తర్వులు కొనసాగుతాయని హైకోర్టు పేర్కొంది. రెండు బిల్లులకు సంబంధించి ఇదివరకే గెజిట్‌ విడుదల అయ్యింది. దాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు తదుపరి కార్యకలాపాలపై స్టేటస్‌ కో విధించింది.