AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

#AP Capital row జగన్ అభ్యర్థనకు అమిత్ షా ఓకే.. ఇక బాబుకు చుక్కలే

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఒకే అన్నారు. దాంతో తెలుగు దేశం నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని వైసిపి నేతలు అంటున్నారు. ఇంతకీ ఏంటా మేటర్?

#AP Capital row జగన్ అభ్యర్థనకు అమిత్ షా ఓకే.. ఇక బాబుకు చుక్కలే
Rajesh Sharma
|

Updated on: Mar 23, 2020 | 7:20 PM

Share

Amith shah shocks Chandrababunaidu: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఒకే అన్నారు. దాంతో తెలుగు దేశం నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయని వైసిపి నేతలు అంటున్నారు. ఇంతకీ ఏంటా మేటర్?

జగన్ గతంలో చేసిన ప్రకటన, దానికి అనుగుణంగా తీసుకున్న నిర్ణయం.. ఆ నిర్ణయానికి అనుగుణంగా కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలు.. వెరసి అమరావతి రాజధాని భూముల ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం మరోసారి పతాక శీర్షికలకు ఎక్కింది. చంద్రబాబు పైనా, టిడిపి నేతపైన ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేస్తున్న ముఖ్యమంత్రి, వైసిపి నేతలు.. ఆ విషయంలో సిబిఐ విచారణ జరిపిస్తామని గతంలోనే ప్రకటించారు. ఆ తర్వాత కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాశారు.

సర్వత్రా కరోనా అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా అనూహ్య నిర్ణయం వెలువరించారు. జగన్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అమరావతి రాజధాని భూముల ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై సిబిఐ విచారణకు అంగీకరించారు. ఈ మేరకు రాష్ట్రానికి లేఖ పంపింది కేంద్ర హోమ్ శాఖ.

డిసెంబర్ నుంచి ఫిబ్రవరి దాక అమరావతి రాజధాని అంశమే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన చర్చనీయాంశం. ఆ తర్వాత రాజకీయ నేతలు, ప్రజల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపైకి మళ్లింది. ఆ తర్వాత కరోనా వైరస్ వ్యాపించడం, దాంతో స్థానిక ఎన్నికలు వాయిదా పడడంతో ఎన్నికల కమిషనర్, జగన్ ప్రభుత్వం, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దానికి తెర లేచింది. దానికి సుప్రీమ్ కోర్టు తెర దించడంతో ఇపుడు కరోనా అంశంపైనే అందరి దృష్టి ఫోకస్ అయ్యింది.

ఈ క్రమంలో అందరి దృష్టి కరోనాపై ఉండగానే అమిత్ షా అనూహ్యమైన స్టెప్ వేశారు. అమరావతి రాజధాని ప్రాంతంలో భూములు ఇన్సైడర్ ట్రేడింగ్ కు గురయ్యాయని ఆరోపిస్తున్న జగన్ ప్రభుత్వం.. ఇది వరకు ఈ అంశంపై ఏర్పాటు చేసిన సిబిసిఐడిని కాదని.. రాజధాని ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖను కోరారు. సిబిసిఐడి విచారణలో వెలుగు చూసిన ప్రాథమికాంశాలు, కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టులను కలిపి సీబీఐ విచారణ కోరుతూ ఇచ్చిన లేఖపై హోమ్ శాఖ సానుకూలంగా స్పందించింది. సిబిఐ విచారణకు అంగీకరించింది.

అమిత్ షా నిర్ణయం టీడీపీ నేతలకు షాక్ తగిలినట్లు అయ్యింది. అయితే ఇన్సైడర్ ట్రేడింగ్ అసలు జరగలేదని వాదిస్తున్న నేతలు కొందరు.. ఎవరు విచారించిన తేలేదేమి లేదని వ్యాఖ్యానిస్తున్నారు. తమకేమి భయం లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు.