బిగ్‏బాస్ విన్నర్‎‏గా అరియానాను గెలిపించండి.. ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ విజ్ఞప్తి..

తెలుగు బిగ్‏బాస్ షో ప్రారంభం అయిన దగ్గరి నుంచి వరుసగా అబ్బాయిలే విన్నర్స్‏గా నిలిచారు. ఇప్పటివరకు ఒక్క అమ్మాయి కూడా విన్నర్ కాలేకపోయింది.

బిగ్‏బాస్ విన్నర్‎‏గా అరియానాను గెలిపించండి.. ట్విట్టర్ వేదికగా రామ్ గోపాల్ వర్మ విజ్ఞప్తి..
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 10, 2020 | 11:25 AM

Big Boss Season 4: తెలుగు బిగ్‏బాస్ షో ప్రారంభం అయిన దగ్గరి నుంచి వరుసగా అబ్బాయిలే విన్నర్స్‏గా నిలిచారు. ఇప్పటివరకు ఒక్క అమ్మాయి కూడా విన్నర్ కాలేకపోయింది. గత రెండు, మూడు టైటిల్ చివరి వరకు వెళ్ళిన అమ్మాయిలు గీతామాధురి, శ్రీముఖి కేవలం రన్నరప్‏తోనే సరిపెట్టుకున్నారు. కానీ ఈసారి ఎలాగైన బిగ్‏బాస్ విన్నర్ అవ్వాలని గట్టి సంకల్పంతో హౌస్‏లోకి అడుగు పెట్టింది అరియానా. ఇంట్లో ఇప్పటి వరకు అబ్బాయిలకు సమానంగా తన ప్రదర్శన ఇస్తూ వస్తుంది. ప్రతి టాస్క్‏లో తన ప్రతిభను చూపించుకుంటుంది. తాజాగా రాజారాణి టాస్క్‏లో కూడా బెస్ట్ రాణిగా ఎంపికైయ్యింది.

ఇక నిన్నటి ఓపిక టాస్క్‏లోనూ తన వస్తువులు పాడుచెస్తున్నా.. తనకు ఎంతో ఇష్టమైన చింటూ బొమ్మను పాడు చేస్తూన్న చలనం లేకుండా, ఎలాంటి ఎక్స్‏ప్రెషన్స్ ఇవ్వకుండా విగ్రహంలా ఉండిపోయింది. టాస్క్ పూర్తైన తర్వాతే తన బాధను బయటకు చెప్పింది. ఆ తర్వాత సోహైల్‏కు అరియానాకు మధ్య తీవ్రస్థాయి గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయం పక్కన పెడితే బిగ్‏బాస్ చివరి దశకు రావడంతో ఎవరి అభిమానులు తమకు ఇష్టమైన కంటెస్టెంట్స్‏ను గెలిపించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అరియానా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ కంటెస్టెంట్‏ను గెలిపించాలని ప్రచారాలు గట్టిగానే చేస్తున్నారు. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా అరియానాకు అండగా నిలబడ్డారు. అరియానాకు ఓటేసి గెలిపించాలని ట్వీట్ చేశారు. బిగ్‏బాస్ ట్రోఫీ గెలిచేందుకు అరియానాకే అర్హత ఉందని తెల్చీ చెప్పారు. దీంతో అరియానాకు ఆర్జీవీ సపోర్టు దొరకడంతో ఆమె ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. అటు అరియానా బిగ్‏బాస్ నుంచి బయటకు వచ్చాక తనతో సినిమా తీయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ రామ్ గోపాల్ వర్మ చెప్పిన విషయం తెలిసిందే.