బిగ్ బాస్ 4 తెలుగు : అరియానాపై విరుచుకుపడ్డ అవినాష్, ఆగం ఆగం అవుతున్నావ్ ఎందుకు బాస్ !
పోయిన వారం ఎవిక్షన్ కార్డ్‌తో ఊపిరి పీల్చుకన్న అవినాష్ చాలా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డాడు. ఎవరైనా ఒక మాట అంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు.
పోయిన వారం ఎవిక్షన్ కార్డ్‌తో ఊపిరి పీల్చుకున్న అవినాష్ చాలా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు. సెల్ఫ్ డిఫెన్స్‌లో పడ్డాడు. ఎవరైనా ఒక మాట అంటే అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. జనాలు తప్పుగా తీసుకుంటారంటూ తోటి కంటెస్టెంట్లపై మండిపడుతున్నాడు. ఇంటి పనులకు సంబంధించి అవినాష్‌కు అరియానా ఓ పని చెప్పగా అందుకు అతడు నిరాకరించాడు. దీనికి అరియానా బాధ్యత తీసుకొని పనులు చేయాలి అని కోరింది. ఈ మాటని పట్టుకొని అవినాష్ ఓ రేంజ్‌లో హడావిడి చేశాడు. నేను బాధ్యత తీసుకోలేదని నన్ను ఎందుకు అన్నావు? అని అరియానాపై ఫైరయ్యాడు. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా ఎంతో వర్క్ చేశాను. ఇప్పుడు అది నా వర్క్ కాదు. నేను నామినేషన్‌లో ఉన్నాను, కాస్త ఆలోచించి మాట్లాడు అంటూ ఓ రేంజ్‌లో క్లాసు పీకాడు. అతడి మాటలకు అరియానా నొచ్చుకుని కన్నీళ్లు పెట్టుకుంది. ఒకానొక సమయంలో సహనం కోల్పోయి ఆమె కూడా గట్టిగా అరిచేసింది. కేవలం చనువు వల్ల అలా చెప్పానే తప్ప, నీకు రెస్పాన్సిబిలిటీ లేదని అనలేదని వివరించే ప్రయత్నం చెప్పింది.
ఈ క్రమంలో అరియానాని అభిజీత్ ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇంతలో సోహైల్ అక్కడకు వచ్చి ఏమైందని ప్రశ్నించగా, దానికి అవినాష్ ఎందుకంత సీన్ చేస్తుందో అర్ధం కావడం లేదని అసహనం వ్యక్తం చేశాడు. అయితే కొద్దిసేపటి తర్వాత మళ్లీ అరియానా దగ్గరకు వెళ్లి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు అవినాష్. బిగ్ బాస్ ఇంట్లో నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే అంటూ ఆమెకు హగ్ ఇచ్చాడు. ఇంకోసారి అలా మాట్లాడను అంటూ ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేశాడు.
Aslo Read :
నేడు రైతులతో కేంద్రం 4వ విడత చర్చలు, సహనాన్ని, బలహీనతగా తీసుకోవద్దని సంఘాల వార్నింగ్
మూడో టీ20కి స్టేడియం నిండా ప్రేక్షకులు, నిబంధనలు సడలించిన న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ !
ఇండియాలో అమ్మే 77 శాతం తేనెలు కల్తీవే, సీఎస్‌ఈ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి