మూడో టీ20కి స్టేడియం నిండా ప్రేక్షకులు, నిబంధనలు సడలించిన న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ !

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో టీ20కి ప్రేక్షకులు పూర్తి స్థాయిలో హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 7 నుంచి న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ కోవిడ్ నిబంధనల్లో...

మూడో టీ20కి స్టేడియం నిండా ప్రేక్షకులు, నిబంధనలు సడలించిన న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ !
Follow us

|

Updated on: Dec 03, 2020 | 7:10 AM

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో టీ20కి ప్రేక్షకులు పూర్తి స్థాయిలో హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబర్ 7 నుంచి న్యూసౌత్ వేల్స్ గవర్నమెంట్ కోవిడ్ నిబంధనల్లో సడలింపు ఇవ్వడమే ఇందుకు కారణం. కరోనా వ్యాప్తి కారణంగా వన్డే సిరీస్​ మ్యాచ్​లు చూసేందుకూ ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇవ్వలేదు. కానీ, డిసెంబర్​ 7న సిడ్నీ వేదికగా జరిగే చివరి టీ20కి పూర్తి స్థాయిలో వీక్షకులు వచ్చేందుకు అనుమతి ఇచ్చింది అక్కడి ప్రభుత్వం. వన్డే సిరీస్​లో ఆస్ట్రేలియా 2-1 తేడాతో ఇండియా గెలిచింది. చివరి మ్యాచ్‌లో విజృంభించి..క్లీన్ స్వీప్ నుంచి తప్పించుకోగలిగింది.  శుక్రవారం నుంచి టీ20 మ్యాచ్​లు జరగనున్నాయి. మొదటి టీ20 మ్యాచ్ కాన్​బెర్రాలోని మనుకా ఓవెల్​ వేదికగా జరగనుంది.

Also Read :  GHMC Election 2020: ఓల్డ్ మలక్‌పేటలో రీ పోలింగ్.. అంతా సిద్ధం చేసిన అధికారులు..!