ఏకైక ఐపీఎల్‌ క్రికెటర్‌గా యశస్వి జైస్వాల్ రికార్డ్

22 April 2024

TV9 Telugu

IPL 2024లో ఏప్రిల్ 22న జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఒక ముఖ్యమైన మ్యాచ్ జరిగింది.

కీలక మ్యాచ్

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ముంబై ఇండియన్స్‌పై 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ప్లే ఆఫ్‌కు మరింత చేరువైంది.

ప్లే ఆఫ్‌కు దగ్గరగా..

రాజస్థాన్ రాయల్స్ తరపున, సందీప్ శర్మ గాయం తర్వాత తిరిగి వచ్చి 18 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీనికి అతనికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' టైటిల్ లభించింది. 

గాయంతో తిరిగొచ్చి

ఇక పరుగుల వేటలో యశస్వి జైస్వాల్ హీరోగా, 60 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి.

జైస్వాల్ స్ట్రైక్ రేట్ 173.33

తన సెంచరీతో, యశస్వి జైస్వాల్ తన పేరిట ఒక గొప్ప రికార్డును కూడా సృష్టించాడు, అలా చేసిన ఏకైక IPL క్రికెటర్ అతనే. 

ఏకైక ఐపీఎల్ క్రికెటర్

23 ఏళ్లలోపు ఐపీఎల్‌లో రెండు సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌గా యశస్వి జైస్వాల్‌ నిలిచాడు. 

23 ఏళ్లలోపు

అతను 21 సంవత్సరాల 123 రోజుల వయస్సులో 2023లో వాంఖడేలో ముంబైపై తన మొదటి సెంచరీని పూర్తి చేశాడు. 

21 ఏళ్ల వయసులో తొలి సెంచరీ

నిన్న (ఏప్రిల్ 22) 22 ఏళ్ల 116 రోజుల వయసులో ముంబై ఇండియన్స్‌పై రెండో సెంచరీ పూర్తి చేశాడు. ఈ విధంగా యశస్వి రెండు సెంచరీలు ముంబైపైనే వచ్చాయి. 

రెండు సెంచరీలు