శివాలెత్తిన ధోని శిష్యుడు.. తుఫాన్ బ్యాటింగ్‌తో స్పెషల్ రికార్డ్

23 April 2024

TV9 Telugu

చెన్నై సూపర్ కింగ్స్ యంగ్ ప్లేయర్, ధోని శిష్యుడు శివం దూబే అత్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు.

ధోని నీడలో దూకుడు

చెన్నై సూపర్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శివమ్ దూబే తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. లక్నోపై కూడా హాఫ్ సెంచరీ చేశాడు.

శివమ్ దూబే అద్భుతం

లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దూబే కేవలం 27 బంతుల్లో 66 పరుగులు చేశాడు. అతని బ్యాట్ నుంచి మొత్తం 7 సిక్సర్లు వచ్చాయి.

దూబే అద్భుత బ్యాటింగ్

శివమ్ దూబే చెన్నై సూపర్ కింగ్స్ తరపున 66 పరుగుల ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు పూర్తి చేశాడు. 

1000 పరుగులు

140 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడిగా శివమ్ దూబే రికార్డ్ నెలకొల్పాడు.

దూబే ఖాతాలో స్పెషల్ రికార్డ్

చెన్నై తరపున శివమ్ దూబే ఇప్పటి వరకు 33 ఇన్నింగ్స్‌ల్లో 1018 పరుగులు చేశాడు. 37.7 సగటు, 160 స్ట్రైక్ రేట్ కంటే ఎక్కువగా ఉంది.

చెన్నైలో మెరిసిన దూబే

ఈ సీజన్‌లో శివమ్ దూబే అద్భతమైన ఫాంలో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 22 సిక్సర్లు కొట్టాడు.

22 సిక్సర్లు కొట్టాడు

శివమ్ దూబే బ్యాటింగ్ సగటు కూడా 50 కంటే ఎక్కువగా ఉంది. ఈ సీజన్‌లో 3 అర్ధ సెంచరీలు చేశాడు.

సగటు 50 కంటే ఎక్కువ