Bigg Boss 4: బిగ్ బాస్‌కు దెబ్బ మీద దెబ్బ.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న ఛానల్ నిర్వాహకులు.!
అసలే టీఆర్పీ రేటింగ్‌తో సతమతమవుతున్న బిగ్ బాస్‌కు మరో దెబ్బ తగిలింది. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో విషయంలో ఛానల్ నిర్వాహకులు షాకింగ్ డెసిషన్..
Bigg Boss 4: అసలే టీఆర్పీ రేటింగ్‌తో సతమతమవుతున్న బిగ్ బాస్‌కు మరో దెబ్బ తగిలింది. ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో విషయంలో ఛానల్ నిర్వాహకులు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. వచ్చే వారం నుంచి షో టైమింగ్ మారనుంది. బిగ్ బాస్ షో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ప్రసారం అవుతోంది. అయితే ఇకపై వచ్చే వారం నుంచి రాత్రి 10 గంటలకు ప్రసారం కానుంది.
డిసెంబర్ 7వ తేదీ నుంచి స్టార్ మా ఛానల్‌లో రాత్రి 7 గంటలకు ‘గుప్పెడంత మనసు’ అనే కొత్త సీరియల్ ప్రారంభమవుతుంది. దీనితో ఆ సమయంలో ప్రసారమయ్యే ‘వదినమ్మ’ సీరియల్ టైం స్లాట్‌ను రాత్రి 9.30 గంటలకు మార్చారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రోమోలు కూడా ఛానల్‌లో వేస్తున్నారు. కాగా, బిగ్ బాస్ చివరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు సమయాల్లో మార్పులు చేర్పులు ఉన్నా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోకుండా షోను ఆదరిస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :
GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..