Bigg Boss 4: మెహబూబ్ ఎలిమినేటెడ్.. గుక్కపెట్టి ఏడ్చేసిన సొహైల్.. అవినాష్‌పై బిగ్‌బాంబ్
బిగ్‌బాస్‌లో పదో వారానికి గానూ ఎలిమినేషన్ జరిగింది. చివరగా మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
Mehaboob out Bigg Boss 4: బిగ్‌బాస్‌లో పదో వారానికి గానూ ఎలిమినేషన్ జరిగింది. చివరగా మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో హౌజ్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. సొహైల్ అయితే గుక్కపెట్టి ఏడ్చేశాడు. టీవీలో బిగ్‌బాస్ 1,2 సీజన్లు చూస్తున్నప్పుడు ఎలిమినేషన్ జరిగే సమయంలో అందరూ ఏడుస్తూనే ఓవర్‌గా చేస్తున్నారనిపించేదని, కానీ ఇప్పుడు ఆ బాధను నేను ఫీల్ అవుతున్నాను సర్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్నేహితుడి కన్నీళ్లను తుడిచిన మెహబూబ్.. నువ్వు, అఖిల్ తప్పుకుండా టాప్ 5లో ఉండాలని అన్నాడు.
ఇక మెహబూబ్ హౌజ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడూ పడనట్లుగా ఉండే హారిక.. ‘నువ్వు లేకపోతే నేను డ్యాన్స్ చేయలేను’ అని కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు నేను ఎవరికి ఎగ్ దోశ వేయాలని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక మెహబూబ్ మాట్లాడుతూ.. హౌస్‌లోకి వచ్చిన తరువాత చాలా నేర్చుకున్నానని, నాకు స్విమ్మింగ్ నేర్పారని.. అభిజిత్ తనకు అన్నలాగా ఉన్నాడని అన్నాడ. ఇంత హార్డ్ వర్క్ చేసేవారిని తానెప్పుడూ చూడలేదని అభి కూడా చెప్పుకొచ్చాడు. ఇక ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా మోనాల్ దగ్గరుండి చూసుకుంటుందని, హౌస్‌లో బెస్ట్ ఎంటర్‌టైనర్ అవినాష్ అని, అఖిలే నంబర్ 1 అని మెహబూబ్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు సోహైల్ మాత్రం మొన్న మాస్టర్ పోయాడు, తర్వాత అఖిల్ వెళ్లొచ్చాడు, ఇప్పుడు మెహబూబ్ వెళ్తున్నాడంటూ ఏడుస్తూనే ఉన్నాడు. ఇక అతడిని మెహబూబ్ ఓదారుస్తూ.. నువ్వు ఎన్ని రోజులు లోపల ఉంటే నేను అన్ని రోజులు నేను కూడా ఉన్నట్లేనని చెప్పుకొచ్చాడు. చివరగా ఓ హిందీ పాటకు డ్యాన్స్ వేశాడు మెహబూబ్. ఆ తరువాత నెక్స్ట్ వీక్ నాన్‌వెజ్ తినకూడదని అవినాష్‌పై బిగ్‌బాంబ్ వేసి వెళ్లాడు.