AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 4: లగ్జరీ బడ్జెట్ టాస్క్‌.. ప్రతాపం చూపిన అరియానా, హారిక

బిగ్‌బాస్‌లో సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ మొదలు కాగా.. మంగళవారం "కొంటె రాక్ష‌సుడు- మంచి మ‌నుషులు" అనే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌ని బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు ఇచ్చాడు

Bigg Boss 4: లగ్జరీ బడ్జెట్ టాస్క్‌.. ప్రతాపం చూపిన అరియానా, హారిక
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 21, 2020 | 7:27 AM

Share

Bigg Boss 4 Telugu: బిగ్‌బాస్‌లో సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ మొదలు కాగా.. మంగళవారం “కొంటె రాక్ష‌సుడు- మంచి మ‌నుషులు” అనే ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌ని బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో రాక్షసుల టీమ్‌లో అరియానా, అవినాష్‌, అఖిల్‌, మెహ‌బూబ్, హారిక‌ ఉండగా.. అభిజీత్, నోయల్, లాస్య, రాజశేఖర్, దివి, సోహెల్, మోనాల్‌లు మనుషుల టీమ్‌లో ఉన్నారు.

ఇక టాస్క్‌లో భాగంగా ఒక్కో రాక్ష‌సుడిని మంచి మ‌నిషిగా మార్చిన ప్ర‌తీసారి.. గార్డెన్ ఏరియాలో ఉన్న రావ‌ణుడి బొమ్మ‌లోని ప‌ది త‌ల‌ల్లో రెండింటిని ప‌గ‌ల‌గొట్టాల్సి ఉంటుంది. అలా ముగ్గురు రాక్ష‌సులను మనుషులుగా మార్చితే మనుషుల టీమ్‌ గెలిచినట్లు. ఇక మంచి మనుషులకు ఇచ్చిన టాస్క్‌లను రాక్షసుల టీమ్ సభ్యులు చెడగొడుతూ ఉంటారు. అయినా స‌రే సహనాన్ని వీడకుండా ఆడాలి.

ఇక రాక్షసుల కాస్టూమ్‌ ధరించిన వారు చెలరేగిపోయారు. ముఖ్యంగా అరియానా, హారిక రచ్చ రచ్చ చేశారు. హారిక, అవినాష్‌లు అమ్మ రాజశేఖర్ మాస్టర్‌ షర్ట్‌లో ఐస్ గడ్డలు వేశారు. హారిక అయితే రాజశేఖర్‌కు ఫేసియల్ చేసింది. అయితే అమ్మ రాజశేఖర్ శాంతి శాంతి అంటూ కామెడీ పండించారు. టాస్క్‌లో భాగంగా స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న పువ్వులతో 50 దండలు అల్లమంటే.. 54 అల్లి విజయం సాధించారు మనుషుల టీమ్‌. దీంతో రాక్షసుడి బొమ్మ నుంచి రెండు తలలు పగలగొట్టి అఖిల్‌ని మంచి మనిషిగా మార్చారు.

ఆ తరువాత మట్టితో వంద ప్రమిదలు చేసే టాస్క్‌లోనూ 160 చేసి మనుషులే గెలిచారు. దీంతో మరో రెండు రాక్షసుడి తలలు పగలగొట్టి మెహబూబ్‌ని మంచి మనిషిగా మార్చాలని అతడి కోసం వెతికారు. అదే సమయంలో సొహైల్‌కి హారిక దొరికింది. అయితే తాను ఉన్నప్పటికీ.. వేరే మనిషి కోసం వెతకడం హారికకు నచ్చలేదు. దీంతో కెమెరా ముందుకు వచ్చి హారిక కంటతడి పెట్టుకుంది. తాను మంచి మనిషిగా మారడం ఎవ్వరికీ ఇష్టం లేదని, అందుకే లగ్జరీ బడ్జెట్‌లో వచ్చే ఒక్క వస్తువును కూడా ముట్టుకోనని ఏడ్చింది. ఇక ఈ ఎపిసోడ్‌ ఈ రోజు కంటిన్యూ అవ్వనుంది.

Read More:

ఆన్‌లైన్‌లోనే  ఈ ఏడాది ఇంటర్మీయట్ ప్రవేశాలు

కుష్మాండదుర్గ అలంకరణలో శ్రీ భ్రమరాంబాదేవి

Follow Us
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
200 కాదు.. ఇక 180 ప్రశ్నలతోనే NEET PG 2026 పరీక్ష.. కొత్త రూల్స్
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
మటన్‌లో బీఫ్ కల్తీని ఎలా గుర్తించాలి..?
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
జులైలో ఆషాఢ మాసం ప్రారంభం.. దక్షిణాయనం, గురుపూర్ణిమతో పాటు పండగలు
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
వరల్డ్ కప్ గెలిస్తే చంద్రుడిపైకి తీసుకెళ్తాం.. ఆ టీమ్‌కు నాసా
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
ఆడపిల్లలకు మూడు రెట్లు బలాన్నిచ్చే పెసరపప్పు గారెలు..
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
విద్యార్ధులకు ఎగిరిగంతేసే న్యూస్.. జూలై 19 వరకు స్కూళ్లకు సెలవులు
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
తేనెటీగలు పెంచండి.. ఆదాయం పెంచుకోండి.. ఆరోగ్యం కాపాడుకోండి
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
పల్లెటూరి ఆకు కూరల పచ్చడి తింటే.. తాతల లాంటి బలం
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
చెన్నై‌లోకి హార్దిక్ పాండ్యా..? సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథన్..!
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు
ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. రాబోయే 15 రోజుల పాటు భారీ వర్షాలు