Bigg Boss 4: ఇవాళ ‘బిగ్’ ట్విస్ట్
బుల్లితెరపై బిగ్‌బాస్ హవా కొనసాగుతోంది. గత సీజన్లకు భిన్నంగా టీఆర్పీలో ఈ సీజన్ దూసుకుపోతోంది. మొదటివారం కాస్త సోసోగానే గడిచినప్పటికీ
Bigg Boss 4 Telugu: బుల్లితెరపై బిగ్‌బాస్ హవా కొనసాగుతోంది. గత సీజన్లకు భిన్నంగా టీఆర్పీలో ఈ సీజన్ దూసుకుపోతోంది. మొదటివారం కాస్త సోసోగానే గడిచినప్పటికీ.. రెండో వారం నుంచి అసలు ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ట్ అయ్యింది. బిగ్‌బాస్ ఇచ్చే టాస్క్‌లు, హౌజ్‌లోని సభ్యుల తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌ని మరింత ఎక్కువ చేయాలనుకుంటోన్న నిర్వాహకులు ఇప్పటికే ఇద్దరిని వైల్డ్ కార్డు ద్వారా లోపలికి పంపారు. ఇక ఇవాళ మరొకరిని హౌజ్‌లోకి పంపబోతున్నట్లు నిన్నటి ప్రోమోలో చూపించారు. దీంతో మరో కంటెస్టెంట్ ఇవాళ్టి నుంచి బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని అందరూ భావించారు. అయితే ఈలోపే షో నిర్వాహకులు మరో ట్విస్ట్ ఇచ్చారు. వచ్చిన కంటెస్టెంట్ అతిథిగా వచ్చారా..? లేక కొత్త కంటెస్టెంట్‌గా వచ్చారా..? చూడండి అంటూ ఓ ప్రోమోను విడుదల చేశారు. దానికి తోడు ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్ వెంట లగేజీ లేకపోవడంతో గెస్ట్ అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే గత సీజన్లలో తమ సినిమాలను, షోలను ప్రమోట్ చేసేందుకు అప్పుడప్పుడు గెస్ట్‌లు హౌజ్‌లోకి వచ్చారు. కానీ ఈ సారి కరోనా నేపథ్యంలో ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే వారిని సైతం క్వారంటైన్‌లో ఉంచి, పరీక్షలు చేసి లోపలికి పంపిస్తున్నారు. మరి ఇప్పుడు వెళ్లిన కంటెస్టెంట్ గెస్ట్‌నా లేక కొత్త కంటెస్టెంట్‌నా అన్నది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. కాగా ఈ బ్యూటీ స్వాతి దీక్షిత్ అని తెలుస్తోంది.
Read More: