Bigg Boss 4: హీట్ పెంచేందుకు వచ్చిన హాట్ బ్యూటీ.. ఎవరో తెలుసా!
తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ నాలుగో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో టాప్ సెలబ్రిటీలు పెద్దగా లేనప్పటికీ.
Bigg Boss 4 Wild Card Entry: తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ నాలుగో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సీజన్‌లో టాప్ సెలబ్రిటీలు పెద్దగా లేనప్పటికీ.. ఉన్న కంటెస్టెంట్‌ల మధ్య పోటాపోటీ పోరు నడుస్తోంది. ఈ సారి బిగ్‌బాస్ టైటిల్‌ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని భావిస్తోన్న ఇంటిలోని పలువురు సభ్యులు గేమ్‌ని బాగా ఆడుతున్నారు. కాగా మరోవైపు ఈ ఎంటర్‌టైన్‌మెంట్‌ని మరింత పెంచేందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి పంపిన నిర్వాహకులు.. ఈ రోజు మరో బ్యూటీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇప్పిస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అయితే ఈ బ్యూటీ స్వాతి దీక్షిత్ అని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? ఇవాళ ఎంట్రీ ఇవ్వబోయే బ్యూటీ ఎవరు..? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.
Read More:
వైఎస్ వివేకా హత్య కేసు.. మరోమారు మున్నాను ప్రశ్నించనున్న సీబీఐ