బన్నీ మూవీలో సాయి పల్లవి.. హీరోయిన్‌గా కాదట..!

ఈ ఏడాది అల వైకుంఠపురములో మూవీతో భారీ హిట్‌ని ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్పలో

బన్నీ మూవీలో సాయి పల్లవి.. హీరోయిన్‌గా కాదట..!
Follow us

| Edited By:

Updated on: Sep 25, 2020 | 12:37 PM

Sai Pallavi in Pushpa movie: ఈ ఏడాది అల వైకుంఠపురములో మూవీతో భారీ హిట్‌ని ఖాతాలో వేసుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్పలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. లాక్‌డౌన్‌తో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ రాగా.. త్వరలోనే చిత్రీకరణను ప్రారంభించాలని సుకుమార్ అనుకుంటున్నారట. ఇక దీనికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం అయ్యాయని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో అల్లు అర్జున్ చెల్లెలి పాత్ర కోసం సుకుమార్, సాయి పల్లవిని అనుకుంటున్నారట. ఇందులో చెల్లెలి పాత్ర కూడా కీలకం కాగా.. ఆ పాత్రకు మలార్ బ్యూటీనే కరెక్ట్ అని భావిస్తోన్న సుకుమార్‌, ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఆఫర్‌పై సాయి పల్లవి ఇంకా తన నిర్ణయాన్ని చెప్పటేదని టాక్‌.

అయితే బలంగా ఉంటే పాత్ర చిన్నదైనా సాయి పల్లవి అందులో నటించేందుకు ఒప్పుకుంటుంది. ఈ క్రమంలో పుష్పకు కూడా ఆమె ఓకే చెప్పే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కనుంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా.. అతడి సరసన రష్‌మిక నటించనుంది. ప్రకాష్‌ రాజు, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్. ముత్తం శెట్టి క్రియేషన్స్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

Read More:

వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ కొనసాగే అవకాశం ఉంది: బిల్‌గేట్స్‌

నా పేరు మీద ఉన్న ప్రాపర్టీ కూడా ఇచ్చేశా.. అయినా వదల్లేదు: హేమంత్ భార్య

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!