Bigg Boss 4: మోనాల్‌పై జీరో పర్సంట్ నమ్మకం కూడా లేదన్న అఖిల్
గత రెండు రోజులుగా మోనాల్‌కు కాస్త దూరంగా ఉంటూ వస్తోన్నాడు అఖిల్. మొన్నటి ఎపిసోడ్‌లో ఒంటరిగా కూర్చొని ఏడ్చేశాడు కూడా.
Monal Akhil conversation: గత రెండు రోజులుగా మోనాల్‌కు కాస్త దూరంగా ఉంటూ వస్తోన్నాడు అఖిల్. మొన్నటి ఎపిసోడ్‌లో ఒంటరిగా కూర్చొని ఏడ్చేశాడు కూడా. ఇక శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో మోనాల్, అఖిల్ మళ్లీ మాట్లాడుకున్నారు. ”గత వారం లగ్జరీ బడ్జెట్ షాపింగ్ సరిగా చేయలేదని చాలా మంది నన్ను నామినేట్ చేశారు. కానీ ఇప్పుడు అందరూ నేను షాపింగ్ చేసిన వాటినే తింటున్నారు” అని మోనాల్ దగ్గర తెగ బాధపడ్డాడు అఖిల్. ఈ సందర్భంగా ఈ ఇద్దరు ఎప్పటిలాడే ముచ్చట్లు పెట్టి గుసగుసలాడుకున్నారు. ఆ క్రమంలో దేవుడిపై నాకు చాలా నమ్మకం అని అఖిల్ అన్నాడు. అప్పుడు మోనాల్.. మరి నాపై లేదా? అని అడిగింది. వెంటనే నీపై జీరో పర్సంట్ కూడా లేదని అఖిల్ చెప్పాడు. దీంతో మోనాల్ కాస్త చిన్న బుచ్చుకున్నట్లైంది.
ఇదిలా ఉంటే ఈ వారం లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా అఖిల్, మెహబూబ్‌లు ఫిజికల్ టాస్క్‌లో బాగా కష్టపడ్డారు. ఈ క్రమంలో అఖిల్ 11 కార్డ్స్ సంపాదించగా.. మెహబూబ్ 12 కార్డ్స్ సంపాదించారు. ఇక గెలిచిన కంటెస్టెంట్ తమకు ఇష్టమైన వ్యక్తితో మసాజ్ చేయించుకోవచ్చిన బిగ్‌బాస్ బంపర్ ఆఫర్ ఇవ్వడంతో.. మెహబూబ్, మోనాల్‌తో మసాజ్ చేయించుకున్నాడు.
Read More:
Bigg Boss 4: చనిపోయిన నా బిడ్డను భుజంపై వేసుకొని వెళ్లా.. ఏడ్చేసిన గంగవ్వ
Bigg Boss 4: లాక్‌డౌన్‌లో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా: అవినాష్